జార్ఖండ్‌లో హైటెన్షన్: అసెంబ్లీ ముట్టడికి విద్యార్థుల యత్నం.. మాజీ సీఎం అరెస్ట్!

జార్ఖండ్‌లో హైటెన్షన్: అసెంబ్లీ ముట్టడికి విద్యార్థుల యత్నం.. మాజీ సీఎం అరెస్ట్!

జార్ఖండ్‌లో ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షల అవకతవకలపై విద్యార్థుల ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో, విద్యార్థులు రాష్ట్ర అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. పాత అసెంబ్లీ ప్రాంతం నుంచి కొత్త అసెంబ్లీ భవనం వైపు కదులుతున్న నిరసనకారులు పోలీసు బారికేడ్లను బద్దలు కొట్టారు. భద్రతను దృష్టిలో ఉంచుకుని పోలీసులు భారీగా మోహరించారు.

 

మరోవైపు, ఈ నియామక పరీక్షల అక్రమాలపై ముఖ్యమంత్రి నివాసం వద్ద నిరసన తెలుపుతున్న బీజేపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాదయాత్ర ప్రారంభించే ముందు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు ఈ ఆందోళనలో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.