యువజన కాంగ్రెస్ఆవిర్భావ వేడుకలు

యువజన కాంగ్రెస్ఆవిర్భావ వేడుకలు

రాయికల్/మంథని/గన్నేరువరం/కోల్​బెల్ట్, వెలుగు: యువజన కాంగ్రెస్​66వ ఆవిర్భావ వేడుకలను కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఆదివారం ఘనంగా జరుపుకొన్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో నిర్వహించిన యూత్​కాంగ్రెస్​ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు. యువత, విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి యువజన కాంగ్రెస్ నిరంతరం పోరాడుతోందని ఆయన అన్నారు. 

జగిత్యాల జిల్లా రాయికల్​గాంధీ చౌక్ వద్ద యువజన కాంగ్రెస్ ​జెండాను ఆవిష్కరించి, కేక్ కట్ చేసి, స్వీట్లు పంచారు. జిల్లా అధ్యక్షుడు బీరం రాజేశ్, ఉపాధ్యక్షుడు సాయికుమార్, నియోజకవర్గ అధ్యక్షుడు భూమారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా మంథని, ముత్తారం మండలాల్లో యూత్ కాంగ్రెస్ నాయకులు జెండాలు ఎగురవేశారు. మంథని అంబేద్కర్ ప్రధాన చౌరస్తాలో కేక్ కట్ చేసి ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో జరిగిన వేడుకల్లో డీసీసీ ప్రెసిడెంట్​రఘునాథ్​ రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్​ బలోపేతానికి యువజన కాంగ్రెస్ శ్రేణుల కృషి ఎంతో ఉంటుందని, రాష్ట్రంలో అధికారంలోకి రావడంలో ఎంతో కీలకంగా వ్యవహరించారని కొనియాడారు. జిల్లా యూత్ ​కాంగ్రెస్ ప్రెసిడెంట్ ​అనిల్​రావు, స్థానిక లీడర్లతో కలిసి కేక్ కట్​చేశారు.