బారామతిలో ప్లైట్ క్రాష్ ల్యాండింగ్.. సేఫ్గా బయటపడ్డ ఇద్దరు పైలెట్లు

బారామతిలో  ప్లైట్ క్రాష్ ల్యాండింగ్.. సేఫ్గా బయటపడ్డ ఇద్దరు పైలెట్లు

పుణె: మహారాష్ట్రలోని పుణె జిల్లా బారామతి ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్టులో ఓ ప్రైవేట్ కంపెనీకి చెందిన శిక్షణ విమానం క్రాష్ ల్యాండ్ అయింది. కొద్ది నెలల కిందట డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఇక్కడే విమాన ప్రమాదంలో మరణించగా, ఇప్పుడు మళ్లీ ఇలాంటి ఘటనే జరగడం స్థానికంగా కలకలం రేపింది. ఆదివారం మధ్యాహ్నం 12:35 గంటలకు ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్టు పరిధిలోని రన్‌‌‌‌‌‌‌‌వేకు సమీపంలో ఈ ఘటన జరిగింది. 

ప్రమాద సమయంలో విమానంలో ఉన్న ఇద్దరు పైలెట్లు ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డారు. ప్లైట్‌‌‌‌‌‌‌‌కు మాత్రం స్వల్ప నష్టం వాటిల్లినట్టు అధికారులు తెలిపారు. వరుస ప్రమాదాల నేపథ్యంలో బారామతి ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్టును ఆధునికీకరించాలని అధికారులు నిర్ణయించారు. విమానాల రాకపోకలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఒక ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) టవర్‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేయనున్నారు.