థాయ్‌లాండ్‌లో చిక్కుకున్న భారతీయుల ఆర్తనాదం.. ఆరుగురిలో ముగ్గురు హైదరాబాదీలే..

థాయ్‌లాండ్‌లో చిక్కుకున్న భారతీయుల ఆర్తనాదం.. ఆరుగురిలో ముగ్గురు హైదరాబాదీలే..

విదేశాల్లో స్థిరపడాలన్న ఆశతో చాలామంది ట్రావెల్ ఏజెంట్ల మోసానికి బలవుతున్నారు. విదేశాల్లో ఉద్యోగాల పేరుతో అమాయకులను టార్గెట్ చేసుకొని మోసాలకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు. ప్రభుత్వాలు అవగాహన కల్పిస్తున్నప్పటికీ ఇలాంటి మోసాలకు అడ్డుకట్ట పడటంలేదు. ఇప్పుడు ట్రావెల్ ఏజెంట్ల మరో మోసం వెలుగులోకి వచ్చింది.ట్రావెల్ ఏజెంట్ల మోసానికి బలయ్యి థాయిలాండ్ లో చిక్కుకున్నారు ఆరుగురు భారతీయులు.మయన్మార్ నుంచి తప్పించుకొని మేసాట్ చేరుకున్న బాధితులు తమను కాపాడాలంటూ వీడియో రిలీజ్ చేశారు.

ట్రావెల్ ఏజెంట్లు తమను మోసం చేసి మయన్మార్ కు తరలించారని ఆరోపిస్తున్నారు. 2025 మే 13 నుంచి చిక్కుకున్నారని బాధితుల కుటుంబసభ్యులు వెల్లడించారు. బాధితుల్లో ముగ్గరు హైదరాబాద్ కు చెందినవారు కాగా.. ఇద్దరు ఏపీ, ఒకరు పశ్చిమ బెంగాల్ కు చెందినవారు.

ALSO READ : విద్యార్థులపై పోలీసుల దాడికి జవాబు చెప్పితీరాల్సిందే..

ఆన్‌లైన్ స్కామ్‌ల్లో బలవంతంగా పనిచేయించారని బాధితులు ఆరోపిస్తున్నారు. నెలల తరబడి నిర్బంధించారని.. చిత్రహింసలు ఎదుర్కొన్నామని అంటున్నారు. తమను సురక్షితంగా ఇండియాకు చేర్చాలని విజ్ఞప్తి చేస్తున్నారు బాధితులు.