కలికాలంలో సంప్రదాయాలు .. ఆచారాలు మానేస్తున్నారు.. వర్షాలలో కొట్టుకుపోతారు.. ఉప్పుగూడ రంగంలో మాతంగి అనూరాధ భవిష్యవాణి

కలికాలంలో సంప్రదాయాలు .. ఆచారాలు మానేస్తున్నారు.. వర్షాలలో కొట్టుకుపోతారు.. ఉప్పుగూడ రంగంలో మాతంగి అనూరాధ భవిష్యవాణి

హైదరాబాద్‌లోని ఉప్పుగూడ మహాంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలలో మాతంగి అనూరాధ పచ్చి కుండపై నిల్చొని    భవిష్యవాణి  రంగం చెప్పారు. అమ్మవారిని ఆవాహం చేసుకుని ఆమె భవిష్యత్తును అంచనా వేస్తూ భక్తులకు అభయం ఇస్తారు.

పాపం ఎక్కువ అవుతుంది.. పుణ్యం తక్కువ అవుతుందన్న అమ్మవారు .. నాపిల్లలే కదా అని కాపాడుకుంటూ వస్తున్నానని చెప్పారు. పెద్దలు.. పిల్లలు  ఆచారాలు.. సంప్రదాయాలు పాటించాలని తెలిపారు.  లేకపోతే వరదలు వచ్చి అందరూ మునిగిపోతారని మాతంగి అనూరాధ భవిష్యవాణి చెప్పారు.  ఎక్కడ మునిగి పోతారో.. ఎక్కడ తేలుతారో కూడా తెలియదు బాలక అని చెప్పారు.  ఇంత బండారు తీసుకొని మీ ఇంట్లో పెట్టుకుంటే చాలు.. మిమ్మలను కాపాడుతానని చెప్పారు. 

కలికాలంలో పిల్లలు చేసే  అనర్దాలను తల్లి దండ్రులే ఆపాలన్నారు.  ఆచారం వీడితే అనర్దాలు జరుగుతాయని చెప్పారు.  పెద్దవాళ్లను గౌరవంగా చూసుకోవాలని మాతంగి అనూరాధ రంగంలో చెప్పారు. 

పూజల అనంతరం మాతంగి అనూరాధ రంగంపైకి వచ్చి వర్షాలు, పంటలు మరియు ప్రజల క్షేమం గురించి భవిష్యవాణి వినిపించారు. తెలంగాణ సంస్కృతికి, బోనాల పండుగకు ప్రతీకగా ఈ రంగం కార్యక్రమం కొనసాగింది.