ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలోని ఆదివాసీలు ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. సాంప్రదాయ దుస్తులు ధరించి డప్పు వాయిద్యాలతో నృత్యాలు చేస్తూ తమ సంస్కృతిని చాటిచెబుతూ సందడి చేశారు.
భారీ ర్యాలీలు తీశారు. కుమ్రం భీం విగ్రహాలకు నివాళులర్పించారు. ఆదివాసీ ఆత్మబంధువులు హైమాన్ డార్ఫ్ దంపతులకు జైనూర్ మండలం మర్లవాయిలో శ్రద్ధాంజలి ఘటించారు.
- నేరడిగొండ/జైనూర్/కోనరావుపేట/రాయికల్, వెలుగు
