హాలియాలో ఘనంగా తీజ్..లంబాడ సంస్కృతికి ప్రతీక మొలకల పండుగ

హాలియాలో ఘనంగా తీజ్..లంబాడ సంస్కృతికి ప్రతీక మొలకల పండుగ
  • ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి హాజరు

హాలియా, వెలుగు:  నల్గొండ జిల్లా హాలియా పట్టణ కేంద్రంలో లంబాడ సంస్కృతికి ప్రతీక అయిన తీజ్ (మొలకల) పండుగ అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్‌‌‌‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని, గిరిజన తలపాగా ధరించి స్థానిక సాయిబాబా గుడి నుంచి ప్రధాన కూడలి వరకు జరిగిన ర్యాలీలో గిరిజన మహిళలతో కలిసి ఉత్సాహంగా నృత్యం చేశారు. 

గిరిజన మహిళలు సంప్రదాయ వేషధారణలో మొలకల బుట్టలను నెత్తిన పెట్టుకుని చేసిన నృత్యాలు పండుగ వాతావరణాన్ని మరింత సందడిగా మార్చాయి. బంజారా సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, గిరిజనుల సంస్కృతికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో కర్నాటి లింగారెడ్డి, మున్సిపల్ చైర్మన్ చింతల చంద్రారెడ్డి, మార్కెట్ చైర్మన్ తుమ్మలపల్లి చంద్రశేఖర్ రెడ్డి, కౌన్సిలర్లు  తదితరులు పాల్గొన్నారు.