3.06 నిమిషాల్లో 80 టైల్స్‌‌‌‌‌‌‌‌ బ్రేక్.. కానిస్టేబుల్ ప్రపంచ రికార్డు

3.06 నిమిషాల్లో 80 టైల్స్‌‌‌‌‌‌‌‌ బ్రేక్.. కానిస్టేబుల్ ప్రపంచ రికార్డు

నారాయణగూడ, వెలుగు: 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జి.వి.ఆర్‌‌‌‌‌‌‌‌. కరాటే అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మిషన్‌‌‌‌‌‌‌‌-80’ ప్రపంచ రికార్డు సాధించింది. ఆదివారం నారాయణగూడ మేల్కోటే పార్క్‌‌‌‌‌‌‌‌లో అకాడమీ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ డాక్టర్‌‌‌‌‌‌‌‌ జి.ఎస్‌‌‌‌‌‌‌‌.గోపాల్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

మల్కాజిగిరి కమిషనరేట్‌‌‌‌‌‌‌‌ పరిధిలోని ఆల్వాల్‌‌‌‌‌‌‌‌ పోలీస్‌‌‌‌‌‌‌‌స్టేషన్‌‌‌‌‌‌‌‌లో కానిస్టేబుల్‌‌‌‌‌‌‌‌గా పనిచేస్తున్న జాతీయ స్థాయి కరాటే క్రీడాకారుడు వి.సుధాకర్‌‌‌‌‌‌‌‌ అసాధారణ ప్రతిభ చాటారు.

నిర్ణీత సమయం 8 నిమిషాలు కాగా.. కేవలం 3 నిమిషాల 6 సెకన్లలో 9 విభిన్న కరాటే బాడీ టెక్నిక్స్‌‌‌‌‌‌‌‌తో 80 షాబాద్‌‌‌‌‌‌‌‌ టైల్స్‌‌‌‌‌‌‌‌ను బ్రేక్‌‌‌‌‌‌‌‌ చేసి రికార్డు నెలకొల్పారు. వండర్‌‌‌‌‌‌‌‌ బుక్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ రికార్డ్స్‌‌‌‌‌‌‌‌ ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌ పర్యవేక్షణలో ఈ ప్రోగ్రామ్​ జరిగింది. సంస్థ ఇండియా చీఫ్‌‌‌‌‌‌‌‌ కో-ఆర్డినేటర్‌‌‌‌‌‌‌‌ బింగి నరేందర్‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌.. సుధాకర్‌‌‌‌‌‌‌‌కు అవార్డు అందజేశారు.