జగిత్యాల జిల్లాలో దారుణం: రూ. 500 అడిగితే యజమాని కొట్టాడని.. ట్రాక్టర్ డ్రైవర్ ఆత్మహత్య....

జగిత్యాల జిల్లాలో దారుణం: రూ. 500 అడిగితే యజమాని కొట్టాడని.. ట్రాక్టర్ డ్రైవర్ ఆత్మహత్య....

జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది... రూ.500 అడిగినందుకు యజమాని ఇంటికొచ్చి కొట్టాడని మనస్తాపంతో ట్రాక్టర్ డ్రైవర్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం ( ఆగస్టు 10 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. జగిత్యాల జిల్లా వెల్దుర్తిలో జరిగింది ఈ హృదయవిదారక ఘటన. 

వెల్దుర్తికి చెందిన రమేష్ ట్రాక్టర్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. తనకు ఇవ్వాల్సిన రూ.500 కోసం యజమానికి ఫోన్ చేసి తిట్టాడు రమేష్. దీంతో రమేష్ ఇంటికి వచ్చి దాడి చేశాడు యజమాని. భార్య పిల్లల ముందే రమేష్ ను చితకబాదాడు యజమాని. రమేష్ స్పృహ కోల్పోవడంతో ఆసుపత్రికి తీసుకెళ్లి ఇంటికి తీసుకొచ్చాడు యజమాని.

ఈ ఘటనతో తీవ్ర మనస్తాపం చెందిన రమేష్ ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రమేష్ కు భార్య, కొడుకు ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. యజమాని గంగారెడ్డితో పాటు మరో వ్యక్తిపై కేసు నమోదు చేశారు. రూ. 500 కోసం తమ కుటుంబాన్ని అనాథ చేశారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బంధువులు.