పెరగనున్న వెండి హాల్‌‌ మార్కింగ్ టెస్టింగ్‌‌

పెరగనున్న వెండి హాల్‌‌ మార్కింగ్ టెస్టింగ్‌‌

న్యూఢిల్లీ: బంగారం ధరలు ఆకాశాన్నంటుతుండటంతో వినియోగదారులు వెండి వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో వెండి ఆభరణాల నాణ్యత, స్వచ్ఛతను తనిఖీ  చేసేందుకు  బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్‌‌ (బీఐఎస్‌‌) సన్నాహాలు చేస్తోంది. వచ్చే రెండేళ్లలో దేశవ్యాప్తంగా వెండి హాల్‌‌మార్కింగ్, టెస్టింగ్ ల్యాబ్‌‌లను  భారీగా విస్తరించనున్నట్లు అధికారులు తెలిపారు. 2025 సెప్టెంబర్ నుంచి వెండి ఆభరణాలకు కూడా స్వచ్ఛతను తెలియజేసే హాల్‌‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్  నంబర్‌‌ను అందుబాటులోకి  తేనున్నారు. 

2024-–25లో 32 లక్షలుగా ఉన్న హాల్‌‌మార్క్ వెండి వస్తువుల సంఖ్య 2025–-26 నాటికి 59 లక్షలకు పెరిగింది.  ప్రస్తుతం వెండి తనిఖీల కోసం 230 కేంద్రాలు పనిచేస్తుండగా, రాబోయే రోజుల్లో బీఐఎస్ సొంత ల్యాబ్‌‌లలోనే వీటి కెపాసిటీని పెంచనున్నారు. ల్యాబ్‌‌లలో  పారదర్శకతను పెంచేందుకు రోబోటిక్స్‌‌, ఏఐను పైలట్ ప్రాజెక్ట్‌‌గా వాడుతున్నారు.