హైదరాబాద్ సిటీలో దారుణం.. జవాన్ ప్రాణాలు తీసిన మందు బ్యాచ్..!

హైదరాబాద్ సిటీలో దారుణం.. జవాన్ ప్రాణాలు తీసిన మందు బ్యాచ్..!

హైదరాబాద్: హైదరాబాద్ హైదర్ షాకోట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదర్ షాకోట్‌లోని ఎస్‌ఎంపీ స్కూల్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

స్థానికుల వివరాల ప్రకారం, అతివేగంగా వచ్చిన మహీంద్ర SUV 350 కారు రోడ్డుపై వెళ్తున్న హైదర్ షాకోట్‌కు చెందిన రిటైర్డ్ ఆర్మీ వ్యక్తిని బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో గాల్లోకి ఎగిరి కిందపడటంతో జవాన్ అక్కడికక్కడే మృతి చెందాడు.

అదే సమయంలో రాపిడో బైక్‌పై వెళ్తున్న ఇద్దరినీ కూడా ఈ కారు ఢీకొట్టడంతో వారికి గాయాలయ్యాయి. వారిలో ఒకరి కాలు విరిగినట్లు సమాచారం. గాయపడిన వారిని చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఉన్న నలుగురు యువకులు వాహనాన్ని అక్కడే వదిలి పరారైనట్లు స్థానికులు చెబుతున్నారు. పోలీసులు కారు నంబర్ ఆధారంగా వివరాలు సేకరించగా, అది శంషాబాద్‌కు చెందిన వాహనంగా గుర్తించినట్లు సమాచారం.

హైదర్ షాకోట్ నుంచి అతివేగంగా వస్తున్న కారును చూసి రోడ్డుపై ప్రయాణిస్తున్నవారు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

కారు నుంచి పారిపోయే సమయంలో కారులో నుంచి మందు బాటిల్ తీసుకొని పరారయ్యారని దర్యాప్తులో వెల్లడైంది. ఫుల్గా మద్యం సేవించి.. ర్యాష్గా కారు నడిపి.. ఒళ్ళు తెలియని స్థితిలో ఓ ఆర్మీ జవాన్ను ఢీకొట్టి.. ప్రాణాలు తీశారని.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.