అడ్మిషన్లు పెంచిన టీచర్లకు నెలాఖరులో సన్మానం

అడ్మిషన్లు పెంచిన టీచర్లకు నెలాఖరులో సన్మానం

హైదరాబాద్, వెలుగు: సర్కారు బడుల్లో అడ్మిషన్ల పెంచిన టీచర్లను ఈ నెలాఖరున సన్మానించాలని స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ నిర్ణయించింది. క్షేత్రస్థాయిలో కష్టపడ్డ టీచర్లను గుర్తించి, వారిని ప్రోత్సహించడం ద్వారా ప్రభుత్వ విద్యను మరింత బలోపేతం చేయవచ్చని అధికారులు భావిస్తున్నారు.  గతేడాదితో పోలిస్తే ఈ విద్యాసంవత్సరం ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. 

ప్రైవేటు స్కూళ్లకు వెళ్లే పిల్లలను ప్రభుత్వ బడుల వైపు మళ్లించడంలో టీచర్లు సక్సెస్ అయ్యారు. గవర్నమెంట్ సెక్టార్ స్కూళ్లలో గతేడాది19.45 లక్షల మంది విద్యార్థులు ఉండగా, ఈ ఏడాది యూడైస్ లెక్కల ప్రకారం 19.66 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు.