జనాభా లెక్కల్లో ఆదివాసీలకు ప్రత్యేక కాలమ్‌‌‌‌ ఉండాలి

జనాభా లెక్కల్లో ఆదివాసీలకు ప్రత్యేక కాలమ్‌‌‌‌ ఉండాలి
  •     తెలంగాణ రక్షణ సేన చీఫ్‌‌‌‌ కవిత 

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ఆదివాసీ యోధులను స్మరించుకోవాల్సిన అవసరం ఉందని టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ చీఫ్‌‌‌‌ కవిత అన్నారు. ప్రపంచవ్యాప్తంగా మూలవాసులకు అన్యాయం జరుగుతూనే ఉందని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఐటీడీఏల్లో అటెండర్‌‌‌‌ నుంచి ఉన్నతాధికారి వరకు ఆదివాసీలే ఉండాలని డిమాండ్‌‌‌‌ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న జనాభా లెక్కల్లో ఆదివాసీల అసలు కులం పేరును నమోదు చేయాలని కోరారు. గోండు అంటూ రాయడం వల్ల వారి ప్రత్యేక అస్తిత్వం కనుమరుగవుతోందన్నారు. 

ఇప్పటివరకు జనాభా లెక్కల్లో ఆదివాసీల సరైన కులం పేరు నమోదు చేయడం లేదని, వారి కోసం ప్రత్యేక కాలమ్‌‌‌‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌‌‌‌ చేశారు.“అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌‌‌‌, ఇండియా.. ఇలా ఏ దేశంలో చూసినా ఆదివాసీలకు అన్యాయం జరిగింది. ఆస్ట్రేలియా ప్రధాని స్వయంగా ఆదివాసీలకు అన్యాయం చేశామని క్షమాపణలు చెప్పారు. మన దేశంలోనూ ఆదివాసీల హక్కుల కోసం పోరాటం చేయడంతో 20 ఏళ్ల కిందట ఫారెస్ట్‌‌‌‌ రైట్స్‌‌‌‌ యాక్ట్‌‌‌‌ వచ్చినా వారికి అన్యాయం జరుగుతూనే ఉంది. అండమాన్‌‌‌‌లో ప్రాజెక్టులు నిర్మిస్తామని చెబుతూ అక్కడి ఆదివాసీలకు అన్యాయం చేస్తున్నారు. ఇప్పటికీ ఆదివాసీలు ఒక్క ఎకరంలో పంట పండించినా ఇబ్బందులకు గురిచేస్తున్నారు” అని పేర్కొన్నారు.