- ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య
యాదాద్రి, వెలుగు : ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడంలో యువజన కాంగ్రెస్ శ్రేణులు ముందుండాలని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో నిర్వహించిన యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవానికి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డిలతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహం నుంచి సుమంగళి ఫంక్షన్ హాల్ వరకు నిర్వహించిన భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, లబ్ధిదారుల వివరాలను సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేయాలని సూచించారు. యువతే దేశ భవిష్యత్ అని, క్రమశిక్షణ, నిబద్ధత, ప్రజాసేవా భావంతో ప్రతి కార్యకర్త పని చేస్తే పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆయన పేర్కొన్నారు.
