కార్తికి జంటగా త్రిష.. మోహన్ రాజా డైరెక్షన్ లో  

కార్తికి జంటగా త్రిష.. మోహన్ రాజా డైరెక్షన్ లో  

కెరీర్ స్టార్ట్ చేసి ఇరవై నాలుగేళ్లు అయినా ఇప్పటికీ అదే స్టార్ డమ్ వరుస సినిమాలతో మెప్పిస్తోంది త్రిష. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. తాజాగా కోలీవుడ్ స్టార్ కార్తికి జోడీగా కనిపించేందుకు రెడీ అవుతోందని తెలుస్తోంది. కార్తీ హీరోగా దర్శకుడు మోహన్ రాజా కాంబినేషన్లో ఇటీవల ఓ చిత్రాన్ని ప్రకటించగా, ఇందులో హీరోయిన్గా త్రిషను సం ప్రదించగా.. ఆమె ఈ ప్రాజెక్ట్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే టాక్ వినిపిస్తోంది. 

అయితే దీనిపై మూవీ టీమ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కార్తి, త్రిష కాం బినేషన్కు ప్రేక్షకుల్లో ఇప్పటికే మంచి క్రేజ్ ఉంది. గతంలో వీరిద్దరూ 'పొన్నియన్ సెల్వన్' చిత్రంలో కలిసి నటించారు. మరోసారి ఈ ఇద్దరు స్క్రీన్ పై జంటగా కనిపించనున్నార నే వార్త అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. 

ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు హీరోయిజం, కమర్షియల్ ఎలి మెంట్స్తో పుల్టెంగ్త్ ఎంటర్టైనర్ సినిమాను రూపొందించనున్నట్లు మేకర్స్ తెలియజేశారు. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్పై ఎస్. లక్ష్మణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.