కపాలి మూవీ నుంచి హన్సిక ఫస్ట్ లుక్ రిలీజ్ 

కపాలి మూవీ నుంచి హన్సిక ఫస్ట్ లుక్ రిలీజ్ 

తెలుగు, తమిళ భాషల్లో దాదాపు ఇరవై ఏళ్లుగా కెరీర్ కొనసాగిస్తోంది హీరోయిన్ హన్సిక మోత్వాని, ప్రస్తుతం ఆమె నారా రోహిత్ హీరోగా నటిస్తున్న సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ ' కపాలి'లో హీరోయిన్ గా కనిపించనుంది. ఆదివారం హన్సిక పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. 

ఇంటెన్స్ లుక్లో కనిపిస్తున్న ఈ పోస్టర్.. కపాలి కథలో ఆమె పాత్రకు ఉన్న ప్రాధాన్యతను సూచిస్తోంది. ఆమె చుట్టూ ఉన్న మిస్టీరియస్ ఎలిమెంట్స్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచుతున్నాయి. రామ్ గన్నీ దర్శకత్వం.. వహిస్తున్న ఈ చిత్రానికి కళ్యాణ చక్రవర్తి మంతిన, భాను కిరణ్ ప్రతాప నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. 

పోలీస్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నారా రోహిత్ పోలీస్ అధికారిగా కనిపించనున్నాడు. హన్సికతో పాటు ప్రణిత పట్నాయక్, లావణ్య, చైతన్య సాగిరాజు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.