అల్లు అర్జున్ హీరోగా తమిళ దర్శకుడు అట్లీ రూపొందిస్తున్న మోస్ట్ క్రేజీయెస్ట్ ప్రాజెక్టు రాకా ఇప్పటికే ఈ మూవీ సూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ మూవీ షూటింగ్ కు సంబంధించి అప్డేడేట్ ఇచ్చాడు అల్లు అర్జున్. ఆదివారం వైజాగ్లో జరిగిన ఏఏఏ సినిమాస్ లాంచ్ కార్యక్రమానికి హాజరైన ఆయన అభిమానులతో మాట్లాడుతూ తాను ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి ఈ కార్యక్రమానికి రాలేదని, నేరుగా రాకా' షూటింగ్ జరుగుతున్న ముంబై నుంచి వైజాగ్ కు వచ్చినట్టు చెప్పాడు.
ప్రస్తుతం 'రాకా' మాటింగ్ జెట్ స్పీడ్గా సాగుతోందని, అయినప్పటికీ వైజాగ్లో జరిగే ఈ కార్యక్రమం కోసం దర్శకుడు అట్లీని అడిగి ఒకరోజు బ్రేక్ తీసుకున్నట్టు తెలియజేశాడు. కార్యక్రమం పూర్తయిన వెంటనే తిరిగి షూటింగ్లో పాల్గొంటానని అన్నాడు.
రాకా' షూటింగ్ విషయంలో అల్లు అర్జున్ ఎంత కమిటెడ్ ఉన్నారో ఈ మాటలు స్పష్టం చేస్తున్నాయి. దీపిక పదుకొణె హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టైటిల్ గ్లింప్స్, ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచాయి. హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ రూపొందిస్తుండటంతో వీలైనంత త్వరగా మాూటింగ్ కంప్లీట్ చేసి వచ్చే ఏడాది ఎండింగ్ లో సినిమా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
