హైదరాబాద్, వెలుగు: క్యూఆర్ పరిధిలో ప్రభుత్వం నిర్మించనున్న ఇందిరమ్మ ఎల్ఐజీ టవర్ల నిర్మాణ పనుల్లో వేగం పెరిగింది. టవర్ల నిర్మాణ స్థలాలను క్లీన్ చేయడానికి హౌసింగ్ బోర్డు ఆదివారం టెండర్లు పిలిచింది. మొత్తం 5 నియోజకవర్గాల పరిధిలోని స్థలాలను క్లీన్ చేయాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
కూకట్‌పల్లిలో 3 ఎకరాలు, శేరిలింగంపల్లిలో 2.85 ఎకరాలు, జూబ్లీహిల్స్‌లో 2.87 ఎకరాలు, కుత్బుల్లాపూర్‌లో 2.60 ఎకరాలు, మేడ్చల్‌లో 2.50 ఎకరాల చొప్పున స్థలాలను క్లీన్ చేయాలని టెండర్‌లో పేర్కొన్నారు. కేటాయించిన స్థలాల్లో ఉన్న రాళ్లు, బండరాళ్లను తొలగించి, వ్యర్థాలను తరలించాలని వెల్లడించారు. క్లీనింగ్ పనులను 21 రోజుల్లోగా పూర్తి చేయాలని అధికారులు నిబంధన విధించారు. టెండర్లు దాఖలు చేయడానికి కాంట్రాక్టర్లకు 7 రోజుల గడువు ఇస్తున్నట్టు తెలపారు.
