పెద్ది కుటుంబ సభ్యులను పరామర్శిస్తూ భావోద్వేగానికి గురైన కేసీఆర్

పెద్ది కుటుంబ సభ్యులను పరామర్శిస్తూ భావోద్వేగానికి గురైన కేసీఆర్

వరంగల్/నర్సంపేట/నల్లబెల్లి, వెలుగు: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్​రెడ్డి కుటుంబ సభ్యులను బీఆర్ఎస్​ చీఫ్​ కేసీఆర్​ ఓదార్చారు. ఆదివారం జరిగిన దశదిన కార్యక్రమానికి కేసీఆర్​ హాజరయ్యారు. పెద్ది ఫొటోకు కేసీఆర్​ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన భార్య పెద్ది స్వప్న, కొడుకు నిదర్శన్ రెడ్డి, కూతురు ధర్మిష్టరెడ్డి, అమ్మ అమృతమ్మను ఓదార్చారు. 

పెద్దితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. పార్టీ అన్ని వేళలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పిల్లల చదువుతో పాటు భవిష్యత్తుకు సంబంధించిన బాధ్యతను పార్టీ తీసుకుంటుందని భరోసా ఇచ్చారు.

మాజీ మంత్రులు జగదీశ్వర్​రెడ్డి, ప్రశాంత్​ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్​రావు, సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ మాలోత్​ కవిత, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్​రెడ్డి, పల్లా రాజేశ్వర్​రెడ్డి, అనిల్​ జాదవ్​, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్​రెడ్డి, శంభీపూర్​ రాజు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు బోయినపల్లి వినోద్​కుమార్,  సత్యవతి రాథోడ్, సిరికొండ మధుసూధనచారి, జోగినపల్లి సంతోష్​కుమార్, శంకర్​నాయక్, ఆరూరి రమేశ్, గండ్ర వెంకటరమణారెడ్డి, రాజయ్య, క్రాంతికుమార్, గండ్ర జ్యోతి​పాల్గొన్నారు.

దశదిన కార్యక్రమానికి పెద్ది అభిమానులు, బీఆర్ఎస్​ లీడర్లు భారీగా తరలివచ్చారు. కాగా, సోమవారం జరిగే పెద్ది సుదర్శన్​రెడ్డి సంతాప సభకు బీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్​రావు నల్లబెల్లి రానున్నారు. సంతాప సభకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.