Anupama Parameswaran: మటన్ వడ్డించగానే గుండె తరుక్కుపోయింది.. అనుపమ పరమేశ్వరన్ ఎమోషనల్

Anupama Parameswaran: మటన్ వడ్డించగానే  గుండె తరుక్కుపోయింది.. అనుపమ పరమేశ్వరన్ ఎమోషనల్

తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్.  కంటెంట్ ఉన్న చిత్రాలనే సెలెక్ట్ చేసుకుంటూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇటీవల 'లాక్ డౌన్' మూవీతో అలరించిన అనుపమ ప్రస్తుతం 'క్రేణీ కళ్యాణం' ప్రాజెక్టులో బిజీగా ఉంది. ఇందులో తరుణ్ భాస్కర్. రాజు వెడ్స్ రాంబాయి ఫేమ్ అఖిల్ ఉద్దెమార్, వీకే సరేష్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. బద్రప్పు గాజుల తెరకెక్కిస్తున్న ఈ సినిమాను బూనమ్ జగన్ నిర్మిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇక సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉండే అనుపమ.. తాజాగా ఓ ఇంటర్వూలో తన వ్యక్తిగత జీవితంలో జరిగిన ఓ చేదు జ్ఞాపకాన్ని గుర్తుచేసుకుంది. 'కార్తికేయ?' షూటింగ్ టైంలో సెట్ లో ఒక చిన్న మేకపిల్ల ఉండేది. ఖాళీ సమయాల్లో దానితో ఎంతో ఇష్టంగా ఆడుకునేదాన్ని అని చెప్పింది. అయితే ఒకరోజు షూటింగ్ లంచ్ బ్రేక్ లో నూకు మటన్ బిర్యాని వడ్డించారు . నేను తింటున్న సమయంలో నా అసిస్టెంట్ వచ్చి ఒక షాకింగ్ న్యూస్ చెప్పాడు.

►ALSO READ | Band Melam Teaser: తెలంగాణ గల్లీల్లో బావమరదల ప్రేమ గోల.. ‘బ్యాండ్ మేళం’ టీజర్ అదిరిందిగా!

 మేడం... మీరు ఇప్పుడు తింటున్నది మీరు ఇందాక అడుకున్న మేకపిల్లనే' అంటూ నవ్వుతూ చెప్పాడు. ఆ మాట వినగానే ఒక్క సారిగా గుండె తరుక్కుపోయింది. అక్కడి కక్కడే వాంతులు చేసుకున్న. ఆ విషయం సన్ను మానసికంగా ఎంతో గాయపరిచింది. అప్పటినుంచి నేను మటన్ ముట్టుకోవడమే మానేశా. 'కార్తికేయ2' షూటింగ్ పూర్తయినప్పటి నుంచి దాదాపు ఇన్నేళ్ల పాటు నేను మాంసాహారానికి దూరంగా ఉన్న అంటూ అవేదన వ్యక్తం చేసింది. అనుపమ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి.