తెలంగాణకేబినెట్ భేటీ కీలక నిర్ణయాలు ఇవే.. 

తెలంగాణకేబినెట్ భేటీ కీలక నిర్ణయాలు ఇవే.. 

తెలంగాణ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో విద్యార్థులతో పాటు అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించాలని నిర్ణయించారు. ఈ పథకం రాష్ట్ర వ్యాప్తంగా 1.50 లక్షల మంది ఉద్యోగులకు వర్తించనుంది. 

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వీబీజీ రామ్‌జీ పథకంపై కూడా మంత్రివర్గం చర్చించింది. రాష్ట్రాల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోకుండా కేంద్రం పథకాన్ని కొనసాగిస్తోందని దీనిపై సుప్రీంకోర్టును వెళ్లాలని నిర్ణయించింది. అయితే ఉపాధి హామీ కూలీలకు ఇబ్బందులు కలగకుండా రాష్ట్రంలో ఈ పథకాన్ని అమలు చేయాలని కూడా సమావేశం అభిప్రాయపడింది.

తెలంగాణలోని ఆస్పత్రల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా ప్రారంభం కానున్న సనత్‌నగర్, ఎల్‌బీనగర్, అల్వాల్ టిమ్స్ ఆసుపత్రులు, వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో డాక్టర్లు, వైద్య సిబ్బంది నియామకానికి మొత్తం 6వేల278 పోస్టులకు ఆమోదం తెలిపింది. ఈ ఆసుపత్రులను నిమ్స్ తరహాలో అభివృద్ధి చేయడంతో పాటు, చికిత్స కోసం సీఎం సహాయనిధి నుంచి ఎల్‌ఓసీలు జారీ చేయాలని నిర్ణయించారు.

అదే విధంగా హైదరాబాద్ మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టు ఫేజ్-1కు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గాంధీ సరోవర్ వరకు 21 కిలోమీటర్ల మేర అభివృద్ధి పనులకు రూ.7,345 కోట్లు మంజూరు చేసింది. త్వరలోనే టెండర్ల ప్రక్రియ ప్రారంభించి పనులు చేపట్టనున్నట్లు మంత్రులు వెల్లడించారు.