Band Melam Teaser: తెలంగాణ గల్లీల్లో బావమరదల ప్రేమ గోల.. ‘బ్యాండ్ మేళం’ టీజర్ అదిరిందిగా!

Band Melam Teaser: తెలంగాణ గల్లీల్లో బావమరదల ప్రేమ గోల.. ‘బ్యాండ్ మేళం’ టీజర్ అదిరిందిగా!

వెండితెరపై కొన్ని కాంబినేషన్లు చూడముచ్చటగా ఉంటాయి. గతేడాది విడుదలైన ‘కోర్ట్" సినిమాతో తమ నటనతో, కెమిస్ట్రీతో కుర్రకారును అలరించిన రోషన్, శ్రీదేవి.. మరోసారి జంటగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ యువ జంట నటించిన లేటెస్ట్ ఎంటర్‌టైనర్ ‘బ్యాండ్ మేళం’. ప్రముఖ స్టార్ రైటర్, నిర్మాత కోన వెంకట్ సమర్పణలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంపై ఇప్పటికే టాలీవుడ్‌లో మంచి అంచనాలు ఉన్నాయి. లేటెస్ట్ గా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు.

తెలంగాణ సోయగం.. 

ఈ ‘బ్యాండ్ మేళం’ మూవీ పూర్తిస్థాయి తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో సాగే రియలిస్టిక్ టీనేజ్ లవ్ స్టోరీ. ఈ చిత్రంలో హీరోహీరోయిన్లు బావమరదలుగా కనిపిస్తున్నారు. మార్చి 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.  లేటెస్ట్ గా  విడుదలైన ఈ టీజర్ చూస్తుంటే, పల్లెటూరి వాతావరణంలో వారిద్దరి మధ్య సాగే గిల్లికజ్జాలు, అల్లరి, మనస్పర్థలు,  ఎమోషనల్ బ్రేకప్ వంటి అంశాలను చాలా సహజంగా చూపెట్టారని అర్థమవుతోంది. తెలంగాణ మాండలికంలో సాగే డైలాగులు యువతను కచ్చితంగా ఆకట్టుకుంటాయని చిత్ర యూనిట్ ధీమా ఉంది..

మేకర్స్ నమ్మకం

సతీష్ జవ్వాజీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. యూత్ పల్స్ తెలిసిన దర్శకుడు కావడంతో, కథను నేటి తరం ఆలోచనలకు తగ్గట్టుగా మలిచారు.  ‘బేబీ’ సినిమాతో సెన్సేషన్ సృష్టించిన విజయ్ బుల్గానిన్ ఈ చిత్రానికి స్వరాలు అందించారు. టీజర్‌లో వినిపించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా మూడ్‌ను ఎలివేట్ చేస్తోంది.  కథనంలో తనదైన శైలిలో వినోదాన్ని జోడించడంలో కోన వెంకట్ సిద్ధహస్తుడు. ఈ సినిమా నిర్మాణంలో ఆయన భాగస్వామ్యం ఉండటం సినిమా రేంజ్‌ను పెంచింది.

►ALSO READ | OTT Movie Review: ‘లక్కీ ది సూపర్ స్టార్’ ఓటీటీ రివ్యూ: ఎమోషన్, ఫ్యామిలీ డ్రామాతో హత్తుకునే కథ

బాక్సాఫీస్ వద్ద అగ్నిపరీక్ష!

రోషన్, శ్రీదేవి జంట చూడటానికి చాలా ఫ్రెష్‌గా ఉండటమే కాకుండా, నటనలోనూ మంచి పరిణతి చూపిస్తున్నారు. 'కోర్ట్' సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ జంట, 'బ్యాండ్ మేళం'తో కమర్షియల్ సక్సెస్‌ను అందుకోవాలని కసితో ఉన్నారు. మార్చి 13న ఈ చిత్రం థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. వేసవి సెలవుల ఆరంభంలో వస్తున్న ఈ పక్కా లోకల్ లవ్ స్టోరీ ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో వేచి చూడాలి. టీజర్ సృష్టించిన బజ్ చూస్తుంటే, థియేటర్లలో ‘బ్యాండ్ మేళం’ మోగడం ఖాయంగా కనిపిస్తోందంటున్నారు అభిమానులు..