మ్యూజిక్ డైరెక్టర్, యాక్టర్ జీవీ ప్రకాష్‌కుమార్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఓ పక్క హీరోగా చేస్తూనే, మరో పక్క సినిమాలకు సంగీతం అందిస్తున్నారు. అయితే, జీవీ ప్రకాష్.. ఒక స్టార్ హీరోగా మారడానికి చాలా కష్టపడుతున్నాడు. ఇందులో భాగంగా ఇటీవలే ఓ కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అదే "లక్కీ ది సూపర్ స్టార్"(Lucky The Superstar).
ఛాంపియన్ బ్యూటీ అనస్వర రాజన్ హీరోయిన్గా నటించింది. ఉదయ్ మహేష్ దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ లవ్ ఎంటర్ టైనర్ ఓటీటీ ప్రేక్షకులను అలరిస్తోంది. జియో హాట్‌స్టార్‌లో ఫిబ్రవరి 20న నుంచి మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతోపాటు తెలుగు సహా ఏడు భాషల్లో అందుబాటులో ఉంది.
కథేంటంటే:
ఒక వీధి కుక్క అప్పుడే పుట్టిన తన పిల్లకు లక్కీ అని పేరు పెడుతుంది. ఒకరోజు అది తప్పిపోయి లక్ష్మణన్ అలియాస్ లక్కీ (జీవీ ప్రకాష్)కు దొరుకుతుంది. అతను దాన్ని తీసుకెళ్లి ఆటిజంతో బాధపడుతున్న తన మేనకోడలు అమ్ముకి ఇస్తాడు. అమ్మూ జీవితం పూర్తిగా మారిపోతుంది. వాళ్ల ఫ్యామిలీలో ఉన్న సమస్యలు పరిష్కారమవుతాయి. అంతా బాగుంది అనుకునే టైంలో వీధి కుక్కలను పట్టుకునే వాళ్లు లక్కీని తీసుకెళ్తారు.
అలా అది కొందరు స్వార్థపరులైన పొలిటీషియన్ల చేతికి చిక్కుతుంది. వాళ్లు లక్కీ ఎవరి దగ్గరుంటే వాళ్లకు అదృష్టం వస్తుందని నమ్ముతారు. దాన్ని తమ రాజకీయ లాభం, పవర్, పాపులారిటీ కోసం ఉపయోగించుకోవాలని ప్లాన్ చేస్తారు. లక్కీ లేకపోవడం వల్ల తన ఫ్యామిలీపై, ముఖ్యంగా అమ్మూపై పడిన ఎమోషనల్ ఇంపాక్ట్ చూసి దాన్ని ఎలాగైనా తిరిగి తీసుకురావాలని ప్లాన్ చేస్తాడు లక్ష్మణన్.
►ALSO READ | RashmikaVijay: కోడలు రష్మికకు విజయ్ తల్లిదండ్రుల షరతులు.. పెళ్లికి ముందు వీడియో వైరల్!
అందుకోసం జంతు ప్రేమికురాలు కీర్తి (అనస్వర రాజన్)తో కలిసి ఒక మిషన్ మొదలుపెడతాడు. ఆ మిషన్ ఏంటి? లక్కీని ఆ పొలిటీషియన్ల నుంచి తిరిగి తీసుకురాగలిగాడా? లేదా? అనేది మిగతా కథ.
విశ్లేషణ:
ఈ చిత్రం భావోద్వేగాలకు పెద్దపీట వేస్తూ కుటుంబ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకుంది. ముఖ్యంగా ఆటిజం అంశాన్ని సున్నితంగా చూపించే ప్రయత్నం చేశారు. జీవీ ప్రకాష్ తన పాత్రలో సహజంగా నటించగా, అనస్వర రాజన్ పాత్రకు తగిన న్యాయం చేసింది.
కామెడీ, ఎమోషన్, రాజకీయ సెటైర్..ఇలా అన్నీటిని కలిపిన మిశ్రమంగా సినిమా సాగుతుంది. కొన్ని సన్నివేశాలు భావోద్వేగంగా హత్తుకుంటాయి. అయితే కథనం కొంత వరకు అంచనా వేయగలిగే విధంగా ఉంటుంది.
సంగీతం విషయానికి వస్తే, జీవీ ప్రకాష్ తన బలం మరోసారి చూపించాడు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలను బలపరుస్తుంది. కొంత నెమ్మదిగా సాగే సన్నివేశాలు ఆడియన్స్ సహనాన్నీ పరీక్షిస్తోంది.
