RashmikaVijay: కోడలు రష్మికకు విజయ్ తల్లిదండ్రుల షరతులు.. పెళ్లికి ముందు వీడియో వైరల్!

RashmikaVijay: కోడలు రష్మికకు విజయ్ తల్లిదండ్రుల షరతులు.. పెళ్లికి ముందు వీడియో వైరల్!


టాలీవుడ్ మోస్ట్ అవేటెడ్ వెడ్డింగ్ మరికొద్ది గంటల్లోనే జరగబోతోంది. గత కొన్నేళ్లుగా సోషల్ మీడియాలో జోరుగా సాగుతున్న ఊహాగానాలకు తెరదించుతూ.. రౌడీస్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న తమ ప్రేమ ప్రాయాణాన్ని పెళ్లి పీటల వరకు తీసుకెళ్లారు.  ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్  వేదికగా ఈ జంట ఒక్కటి కాబోతున్నారు. ఈ నేపథ్యంలో 'విరోష్' (ViRash) ఫ్యాన్స్ పాత వీడియోలను ట్రెండ్ చేస్తూ సందడి చేస్తున్నారు.

కోడలుకు విజయ్ తల్లిదండ్రుల షరతులు!

విజయ్-రష్మికల కెమిస్ట్రీ 'గీత గోవిందం' సినిమాతోనే మొదలైంది. ఆ సినిమా సక్సెస్ మీట్ సమయంలోనే విజయ్ తల్లిదండ్రులు తమ కాబోయే కోడలి గురించి మనసులో మాట బయటపెట్టారు. యాంకర్ సుమ అడిగిన ప్రశ్నకు విజయ్ తల్లి మాధవి స్పందిస్తూ.. "మా బాబుని బాగా చూసుకునే కోడలు వస్తే చాలు. వృత్తిరీత్యా అతడు ఇండస్ట్రీలో ఉన్నాడు కాబట్టి, తనను అర్థం చేసుకునే మనస్తత్వం ఆమెకు ఉండాలి" అని చెప్పారు.

ఇక విజయ్ తండ్రి గోవర్ధన్ రావుమాట్లాడుతూ.. "వాడికి నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మాకు అభ్యంతరం లేదు. కులమతాలతో పనిలేదు కానీ, ఆమె భారతీయురాలు.. మరీ ముఖ్యంగా 'సౌత్ ఇండియన్' అయితే నాకు చాలా సంతోషం" అని ఆ రోజే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అరేంజ్డ్ మ్యారేజ్ తనకు సెట్ కాదని, లవ్ మ్యారేజ్ చేసుకుంటానని విజయ్ గతంలోనే చెప్పాడు. కన్నడ భామ అయిన రష్మిక, ఇప్పుడు వారి ఇంటి కోడలిగా వెళ్తుండటంతో అప్పట్లో విజయ్ తల్లిదండ్రులు అన్న మాటలు ఇప్పుడు నిజమయ్యాయని అభిమానులు ఖుషీ అవుతున్నారు.

 

అద్భుతమైన పార్ట్నర్ దొరికాడు..

రష్మిక కూడా తన ప్రేమను చాలాసార్లు పరోక్షంగా వ్యక్తం చేసింది. 'ది గర్ల్‌ఫ్రెండ్' చిత్ర ప్రమోషన్లలో ఆమె మాట్లాడుతూ.. "నాకు ఒక అద్భుతమైన పార్ట్నర్ దొరికాడు.. ఈ సినిమా నాకు ఎంత ముఖ్యమో, నా జీవితంలో ఆయన కూడా అంతే ముఖ్యం" అంటూ భావోద్వేగానికి గురైంది. అప్పుడే నెటిజన్లు ఆ 'పార్ట్నర్' విజయ్ అని ఫిక్స్ అయిపోయారు.

ఉదయ్‌పూర్‌లో పెళ్లి హడావుడి!

ప్రస్తుతం ఉదయ్‌పూర్‌లోని  లగ్జరీ హోటల్ ITC Mementosలో పెళ్లి వేడుకలు అట్టహాసంగా మొదలయ్యాయి. ఇప్పటికే హల్దీ, సంగీత్ వేడుకల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కేవలం సన్నిహితులు , కుటుంబ సభ్యుల సమక్షంలో అత్యంత ప్రైవేట్‌గా ఈ వివాహం జరగనుంది. హల్దీ వేడుక పసుపు రంగు థీమ్‌తో సందడిగా సాగునట్లు సమాచారం. 

►ALSO READ | హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని దేవీ70ఎంఎం థియేటర్ క్లోజ్

గత ఆరేళ్లుగా విజయ్ రష్మికల స్నేహం, విదేశీ వెకేషన్లు, ఒకరినొకరు సపోర్ట్ చేసుకున్న క్షణాలతో కూడిన 'ఫ్యాన్ మేడ్' వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.  కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్న ఈ జంటకు ఆల్ ది బెస్ట్ 'విరోష్' అని అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.