హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని దేవీ70ఎంఎం థియేటర్ క్లోజ్

హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని దేవీ70ఎంఎం థియేటర్ క్లోజ్

హైదరాబాద్‌: హైదరాబాద్ సిటీలో మరో సింగిల్ స్క్రీన్ థియేటర్ తాత్కాలికంగా మూతపడింది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని దేవీ70ఎంఎం థియేటర్ క్లోజ్ అయింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ థియేటర్ యాజమాన్యం థియేటర్ ముందు గేటుకు ఒక బ్యానర్ తగిలించింది. దేవీ 70ఎంఎం థియేటర్ రినోవేషన్లో ఉందని.. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అండ్ బ్రైటెస్ట్ స్క్రీన్గా రినోవేట్ చేసి త్వరలోనే థియేటర్ను మళ్లీ ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకొస్తామని థియేటర్ యాజమాన్యం తెలిపింది.

హైదరాబాద్లో పలు సింగిల్ స్క్రీన్ థియేటర్లు రీనొవేషన్ వర్క్ కారణంగా తాత్కాలికంగా మూతబడ్డాయి. కూకట్ పల్లిలోని విశ్వనాథ్ థియేటర్ కూడా ఈ కారణంగానే మూతపడింది. జీడిమెట్ల రంగా థియేటర్ కూడా తాత్కాలికంగా మూతపడింది. ఒక కొత్త సినిమా విడుదలవుతుందంటే హైదరాబాద్ సిటీలో ఉండే సందడే వేరు. మల్టీప్లెక్స్ల సంగతి కాసేపు పక్కన పెడితే.. సింగిల్ స్క్రీన్ థియేటర్ల ముందు అభిమానులు చేసే హంగామా అంతాఇంతా కాదు.

►ALSO READ | VIral Video: పొట్టు పొట్టున కొట్టుకున్న రాజమౌళి-మహేష్ బాబు.. ఆర్జీవీ సంచలన ట్వీట్..!