SL vs NZ: టీ20 వరల్డ్ కప్ సూపర్–8లో భాగంగా కొలంబోలోని ఆర్. ప్రేమదాస మైదానంలో న్యూజిలాండ్ వర్సెస్ శ్రీలంక జట్లు తలపడబోతున్నాయి. ఇంగ్లాండ్ జట్టు ఇప్పటికే గ్రూప్–2 నుంచి సెమీఫైనల్ బెర్త్ ఫిక్స్ చేసుకోవడంతో, మిగిలిన ఒక సెమీస్ స్థానం కోసం ఇప్పుడు శ్రీలంక, న్యూజిలాండ్, పాకిస్తాన్ మధ్య తీవ్ర పోటీ కొనసాగుతుంది. ఈ క్రమంలో శ్రీలంక – న్యూజిలాండ్ మధ్య జరగనున్న ఈ మ్యాచ్ అత్యంత కీలకంగా మారింది. సూపర్–8 తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్ చేతిలో ఓడిన లంకేయులు, ఈ మ్యాచ్‌లో తప్పక గెలిచి టోర్నీలో నిలవాలని చూస్తుంది. మరోవైపు, పాకిస్తాన్‌తో కివీస్ ఆడాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో, న్యూజిలాండ్ కు కేవలం ఒక పాయింట్ మాత్రమే దక్కింది. ఇప్పుడు శ్రీలంకతో జరిగే మ్యాచ్‌లో ఓడితే, ఇంగ్లాండ్‌పై భారీ విజయం సాధించాల్సిన పరిస్థితి కివీస్ కు ఏర్పడుతుంది.
హెడ్ టు హెడ్ రికార్డు:
ఇరు జట్లు ఇప్పటివరకు మొత్తం 28 మ్యాచ్‌లు ఆడాయి. ఇందులో చివరి ఐదు మ్యాచ్‌లలో న్యూజిలాండ్ 3 విజయాలు సాధించగా, శ్రీలంక 2 మ్యాచ్‌లు గెలిచింది.
* న్యూజిలాండ్ విజయాలు: 16
* శ్రీలంక విజయాలు: 9
* టై: 2
* నో రిజల్ట్: 1
వాతావరణం:
* ఉష్ణోగ్రత: సుమారు 29 డిగ్రీలు సెల్సియస్
* కనిష్ట ఉష్ణోగ్రత: 25 డిగ్రీలు
* వర్ష సూచన: మోస్తరు వర్షం పడే అవకాశం ఉంది
ఇవాళ కొలంబోలో ఆకాశం మేఘావృతంతో పాటు మధ్య మధ్యలో వర్షం కురిసే సూచనలు ఉన్నాయి.
►ALSO READ | ICC Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత్ దూకుడు.. బ్యాటింగ్, బౌలింగ్లో మనమే నెంబర్ వన్
