ICC Rankings: భారత టీ20 జట్టు తాజా ఐసీసీ మెన్స్ టీ20 ర్యాంకింగ్స్‌లో అద్భుతమైన ప్రదర్శన చేసింది. టాస్–10 బ్యాటర్ల జాబితాలో భారత జట్టు డామినేషన్ మరింత పెరిగింది. టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో నంబర్–1 స్థానాన్ని కొనసాగిస్తుండగా, వికెట్‌కీపర్ ఇషాన్ కిషన్ ఇషాన్ కిషన్ మూడు స్థానాలు మెరుగు పర్చుకుని టాప్–5లోకి దూసుకొచ్చాడు. టీ20 వరల్డ్ కప్‌లో అభిషేక్ శర్మకు ఆరంభంలో పెద్ద స్కోర్లు చేయకపోయినా, ర్యాంకింగ్స్‌లో మాత్రం అతడి ఆధిపత్యం ఇంకా కొనసాగుతోంది. ఇంగ్లాండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ రెండో స్థానంలో నిలిచాడు. పాకిస్థాన్ ఓపెనర్ సహిబ్‌జాదా ఫర్హాన్ రెండు స్థానాలు ఎగబాకి థర్డ్ ప్లేస్ కి చేరుకున్నాడు. ప్రస్తుత టోర్నీలో ఫర్హాన్ ఎక్కువ రన్స్ చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు.
దక్షిణాఫ్రికా యువ ఆటగాడు డీవాల్డ్ బ్రెవిస్ 10 స్థానాలు మెరుగుపడి 9వ స్థానానికి చేరుకోగా, అఫ్గానిస్థాన్ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్, వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్, ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రుక్ కూడా ఈ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో తమ స్థానాలను మరింత మెరుగుపర్చుకున్నాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా మళ్లీ నంబర్–1 స్థానాన్ని దక్కించుకోగా, భారత్ నుంచి శివమ్ దూబే రెండు స్థానాలు మెరుగుపడి 7వ స్థాననికి చేరుకోగా, అఫ్గానిస్థాన్ సీనియర్ ప్లేయర్ మహమ్మద్ నబీ 8వ స్థానం కొనసాగుతున్నాడు.
ALSO READ : రింకు సింగ్ ఇస్ బ్యాక్.. జోరుగా నెట్స్లో ప్రాక్టీస్
మరోవైపు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో కూడా భారత ఆటగాళ్లు మంచి ప్రదర్శన చేశారు. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో భారీగా పరుగులు ఇచ్చినప్పటికీ, వరుణ్ చక్రవర్తి నంబర్–1 స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. దక్షిణాఫ్రికా పేసర్ కార్బిన్ బోష్ అద్భుత ప్రదర్శనతో 21 స్థానాలు ఎగబాకి మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. భారత స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కూడా టాప్–10లో చేరాడు. తాజా ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో నెంబర్ వన్ గా నిలిచాయి.
