Rinku Singh: భారత స్టార్ బ్యాటర్, ఫినిషర్ రింకు సింగ్ నిన్న (ఫిబ్రవరి 24న) ఉన్నట్టుండి టీమ్ ని వదిలి పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. కుటుంబ అత్యవసర కారణాలతోనే రింకు తన స్వగ్రామానికి వెళ్లినట్లు బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. అతడి తండ్రి కచన్ చంద్ సింగ్ క్యాన్సర్‌తో పోరాడుతూ వెంటిలెటర్‌పై ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. గురువారం చెన్నైలోని చిదంబరం స్టేడియంలో భారత్ వర్సెస్ జింబాబ్వే జట్ల మధ్య కీలక పోరు జరగనుంది. రింకు సింగ్ ఉన్నట్టుండి జట్టును వదిలి పెట్టడంతో అభిమానుల్లో ఆందోళన స్టార్ట్ అయింది. ఇవాళ రింకు సింగ్ గురించి భారత్ మేనేజ్మెంట్ ఓ కీలక అప్‌డేట్ ఇచ్చింది.
సూపర్– 8లో జింబాబ్వేతో రేపు ( ఫిబ్రవరి 26న) జరిగే మ్యాచ్‌కి రింకు సింగ్ అందుబాటులో ఉంటాడని భారత జట్టు బ్యాటింగ్ కోచ్ శితాంశు కోటక్ తేల్చి చెప్పారు. రింకు సింగ్ తండ్రి అనారోగ్యంతో ఉండటం వలన.. ఇలాంటి ఎమర్జెన్సీ పరిస్థితుల్లో కుటుంబంతో ఉండటానికి అతడు టీమ్ ని వీడాడు. కానీ జింబాబ్వేతో జరిగే మ్యాచ్‌కు అతడు అందుబాటులో వస్తాడని పేర్కొన్నారు. బుధవారం సాయంత్రానికి రింకు టీమిండియాతో చేరి, రేపటి మ్యాచ్ కోసం నెట్స్ లో ప్రాక్టీస్ చేసే అవకాశం ఉందని శితాంశు కోటక్ స్పష్టం చేశారు.
ALSO READ : రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో రచ్చ రచ్చ..
డిఫెండింగ్ ఛాంపియన్ భారత్‌కు జింబాబ్వేతో జరిగే మ్యాచ్ అత్యంత కీలకంగా మారింది. సూపర్– 8లో సౌతాఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతో సూర్య సేన ఓడిపోయింది. దీని వల్ల నెట్ రన్‌రేట్ -3.800కి పడిపోయింది. కాబట్టి ఈ మ్యాచ్‌లో భారీ తేడాతో గెలిస్తేనే సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి. మరోవైపు టాప్ ఆర్డర్ బ్యాటింగ్ వైఫల్యం భారత జట్టును తీవ్రంగా కలవర పెడుతోంది. అభిషేక్ శర్మ ఫామ్ జట్టుకు తీవ్రంగా నష్టం కలిగిస్తుంది. ఇటు ఫినిషర్‌గా రింకు సింగ్ కూడా ఇప్పటి వరకు మంచి ప్రదర్శనలు చేయలేదు. జింబాబ్వేతో మ్యాచ్‌లో కట్టుదిట్టమైన ప్రణాళికతో బరిలోకి దిగి విజయం సాధించాలని భారత్ క్రికెట్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
