హైదరాబాద్లో టిఫిన్ సెంటర్ ఓనర్లకు గుడ్ న్యూస్

హైదరాబాద్లో టిఫిన్ సెంటర్ ఓనర్లకు గుడ్ న్యూస్

న్యూఢిల్లీ: హోటళ్లు, రెస్టారెంట్లు వాడే కమర్షియల్ ఎల్పీజీ ధర భారీగా తగ్గింది. 19 కిలోల సిలిండర్ ధర ఢిల్లీలో రూ.192 తగ్గి రూ.2,738 అయింది. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ.206 తగ్గి  రూ.2,985కి చేరింది. ఐదు కిలోల సిలిండర్​ ధరను కూడా రూ.808.50 నుంచి రూ.762కి తగ్గించారు.

అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా చమురు కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి.  విమాన ఇంధన (ఏటీఎఫ్​) ధర లీటరుకు రూ.ఐదు పెరిగి రూ.115 అయింది. అంతకుముందు ఇది రూ.110 ఉండేది.

గత నెల ఒకటో తేదీన కూడా కమర్షియల్ ఎల్పీజీ ధర రూ.183.5 తగ్గింది.  వెస్ట్ ఏషియా సంక్షోభం కారణంగా జూన్​లో ధరలు రికార్డు స్థాయికి చేరాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఘర్షణలు ప్రారంభమైన తర్వాత, కమర్షియల్ ఎల్పీజీ ధర రూ.1,373 వరకు పెరిగింది. జూన్ నాటికి రూ.3113.50కి చేరింది. అయితే ఇండ్లలో వాడే సాధారణ ఎల్పీజీ ధరలను మార్చలేదని కంపెనీలు ప్రకటించాయి.