Ranji Trophy Final: రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో రచ్చ రచ్చ.. పరాస్– అనీష్ మధ్య గొడవ

Ranji Trophy Final: రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో రచ్చ రచ్చ.. పరాస్– అనీష్ మధ్య గొడవ

Ranji Trophy Final: రంజీ ట్రోఫీ 2025–26 ఫైనల్ మ్యాచ్ హుబ్లీలోని కేఎస్‌సీఏ క్రికెట్ గ్రౌండ్‌లో ఉత్కంఠభరితంగా కొనసాగింది. ఈ మ్యాచ్ లో ఓ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. జమ్మూ కాశ్మీర్ టీం కెప్టెన్ పరాస్ డోగ్రా, కర్ణాటక ఫీల్డర్ అనీష్ కేవీ మధ్య ఘర్షణ జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు కర్ణాటక ఆటగాడు మయాంక్ అగర్వాల్ మధ్యలోకి వచ్చి ఇద్దరినీ కంట్రలో చేశాడు.  

జమ్మూ కాశ్మీర్ ఇన్నింగ్స్ 100వ ఓవర్‌లో ఈ వివాదం జరిగింది. కర్ణాటక పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ వేగంగా వేసిన బంతి మిడిల్, ఆఫ్ స్టంప్ దిశగా పడి, పిచ్ మీద తాకిన అనంతరం కొంచెం స్ట్రెయిట్ కావ్వడంతో పరాస్ డోగ్రా షాక్ అయ్యాడు. డిఫెన్స్ ఆడే ప్రయత్నంలో బంతి అతడి బ్యాట్ ఎడ్జిలో తాకి బౌండర్ వైపు దూసుకెళ్లింది. అక్కడే ఉన్న ఫీల్డర్ పూల్ డైవ్ చేసినప్పటికీ బంతిని అడ్డుకోలేకపోయాడు. బంతి బౌండరీకి చేరడంతో డోగ్రాకు నాలుగు రన్స్ లభించాయి. కానీ బౌండరీ తర్వాత జరిగిన ఘటన అందరినీ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేసింది. సిల్లీ పాయింట్‌లో హెల్మెట్ ధరించి నిలిచిన అనీష్ కేవీతో పరాస్ డోగ్రా మధ్య మాటల యుద్ధానికి దిగాడు. జస్ట్ సెకండ్ లోనే ఆ గొడవ తీవ్ర స్థాయికి చేరిపోయింది. ఇద్దరూ కోపంగా కనిపించడంతో పరిస్థితి చేజారేలా అనిపించింది.

గొడవ పెద్దగా కాకుండా మయాంక్ అగర్వాల్ జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. ఈ ఘటన తర్వాత అంపైర్లు కర్ణాటక కెప్టెన్ దేవదత్ పడిక్కల్‌తో కూడా మాట్లాడి, ఫీల్డింగ్ టీం క్రమశిక్షణ పాటించాలని వార్నింగ్ ఇచ్చారుతతతతతతతతతతతతతతతతత7. అనంతరం అనీష్ కేవీకి పరాస్ డోగ్రా క్షమాపణ చెప్పేందుకు ట్రై చేశాడు. కానీ ఫీల్డర్ అనీష్ ఆ క్షమాపణను స్వీకరించడానికి ఇంట్రెస్ట్ చూపించలేదని తెలుస్తుంది. అంపైర్లు కూడా పరిస్థితిని వివరించి అతడిని శాంతింపజేయడానికి యత్నించారు.  

►ALSO READ | IND vs ZIM T20 WC26: డూ ఆర్ డై మ్యాచ్‌కు ముందు గుడికి టీమిండియా ప్లేయర్స్.. మారుండీశ్వరర్ ఆలయంలో పూజలు

ఈ ఫైనల్‌కు చేరుకునే క్రమంలో ఇరు జట్లు కూడా చాలా కష్టపడ్డాయి. కర్ణాటక జట్టు ప్రారంభంలో బలంగా ఆడినా మధ్యప్రదేశ్ చేతిలో ఓడిపోయిన తర్వాత ముంబై, ఉత్తరాఖండ్‌పై గెలిచి ఫైనల్‌కు వచ్చింది. జమ్మూ కాశ్మీర్ కూడా ముంబై చేతిలో తొలి మ్యాచ్లో ఓడిన అనంతరం సెమీఫైనల్‌లో బెంగాల్‌ను ఓడించి 67 ఏళ్లలో తొలిసారిగా రంజీ ట్రోఫీ ఫైనల్‌కు జమ్ము కాశ్మీర్ అడుగు పెట్టింది. ప్రస్తుతం ఫైనల్ రెండో రోజు ముగిసే సమయానికి జమ్మూ కాశ్మీర్ 109 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 351 రన్స్ చేసింది. పరాస్ డోగ్రా (22*), కన్హయ్య వాధవన్ (30*) క్రీజులో కొనసాగుతున్నారు. 

ఇరు జట్ల ప్లేయింగ్ ఎలెవెన్స్: 
కర్ణాటక జట్టు: కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, దేవదత్ పడిక్కల్ (కెప్టెన్), కరుణ్ నాయర్, స్మరణ్ రవిచంద్రన్, శ్రేయాస్ గోపాల్, కృథిక్ కృష్ణ (వికెట్ కీపర్), విద్యాధర్ పాటిల్, విజయ్‌కుమార్ వైశాక్, శిఖర్ షెట్టి, ప్రసిద్ధ్ కృష్ణ

జమ్మూ కాశ్మీర్ జట్టు: కామ్‌రాన్ ఇక్బాల్, యావర్ హసన్, శుభమ్ పుండీర్, పరాస్ డోగ్రా (కెప్టెన్), అబ్దుల్ సమద్, కన్హయ్య వాధవన్ (వికెట్ కీపర్), అబిద్ ముస్తాక్, ఆఖిబ్ నబీ దార్, యుధ్వీర్ సింగ్ చరక్, సాహిల్ లోత్రా, సునీల్ కుమార్.