Hardik Pandya: IPL 2026లో ముంబై ఇండియన్స్ (MI) తీవ్ర నిరాశాజనక ప్రదర్శన చేసిన తర్వాత, ఆ జట్టును వీడాలని కెప్టెన్ హార్దిక్ పాండ్యా నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఐపీఎల్ ట్రేడ్ మార్కెట్లో హార్దిక్ హాట్ టాపిక్‌గా మారాడు. ఆయనను దక్కించుకోవడానికి మూడు ఫ్రాంచైజీలు తెగ పోటీ పడుతుండగా, ముంబైకి ప్రధాన ప్రత్యర్థి అయిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఈ మెగా ట్రేడ్‌లో అందరికంటే ముందు వరుసలో నిలిచింది. అయితే, ఈ డీల్ పూర్తి కాకుండా హార్దిక్ పాండ్యా విధించిన ఒక షరతు అడ్డంకిగా మారినట్లు తెలుస్తోంది.
నాకు కెప్టెన్సీ కావాలి.. హార్దిక్ షరతుపై CSK పరేషన్:
చెన్నై సూపర్ కింగ్స్‌లో చేరాలంటే తనకు కెప్టెన్సీ ఇవ్వాలని హార్దిక్ పాండ్యా పట్టుబడుతున్నట్లు తెలుస్తుంది. అయితే ప్రస్తుత కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌ను జట్టు దీర్ఘకాలిక భవిష్యత్ నాయకుడిగా (Face of the Franchise) భావిస్తున్న సీఎస్‌కే యజమాన్యం, అతడ్ని కెప్టెన్సీ నుంచి తప్పించడానికి ఏమాత్రం సిద్ధంగా లేదు. దీంతో హార్దిక్, రుతురాజ్ గైక్వాడ్‌ల మధ్య కెప్టెన్సీ పోటీ ఈ ట్రేడ్ డీల్‌కు అతిపెద్ద అడ్డంకిగా మారింది.
మధ్యవర్తిత్వం చేయనున్న MS ధోని?:
ఈ చిక్కుముడిని విప్పడానికి సీఎస్‌కే దిగ్గజం ఎమ్‌ఎస్ ధోని రంగంలోకి దిగే అవకాశం ఉందని తెలుస్తోంది. హార్దిక్ పాండ్యాతో ధోనికి చాలా మంచి అనుబంధం ఉంది. మరోవైపు IPL 2024 కి ముందే కెప్టెన్సీ బాధ్యతలను స్వయంగా రుతురాజ్‌కు అప్పగించిన ధోని, ఆయనను ఎంతోగానో ప్రోత్సహించాడు. కాబట్టి ధోని కల్పించుకుని హార్దిక్ లేదా రుతురాజ్‌లతో మాట్లాడి, కెప్టెన్సీ పట్టువదలి జట్టు ప్రయోజనాల కోసం ఒప్పించే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.
రేసులో KKR, ఢిల్లీ క్యాపిటల్స్:
ఒకవేళ సీఎస్‌కేతో చర్చలు విఫలమైతే హార్దిక్ పాండ్యాను సొంతం చేసుకోవడానికి మరికొన్ని ఫ్రాంచైజీలు కాచుకుని కూర్చున్నాయి. అజింక్యా రహానే రిటైర్మెంట్ తర్వాత కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)కు ఒక అనుభవజ్ఞుడైన కెప్టెన్, భారత ఆల్‌రౌండర్ అత్యవసరం.. 2022లో గుజరాత్ టైటాన్స్‌కు ఐపీఎల్ ట్రోఫీని, 2023లో ఫైనల్‌కు తీసుకెళ్లిన హార్దిక్ నాయకత్వ అనుభవం KKRకు బాగా ఉపయోగిపడుతుంది. అక్షర్ పటేల్ ట్రేడ్ చర్చలతో ఢిల్లీ క్యాపిటల్స్ (DC) కూడా హార్దిక్ పరిస్థితిని నిశితంగా గమనిస్తోంది. జట్టుకు సరైన భారత పేస్ ఆల్‌రౌండర్‌తో పాటు కెప్టెన్ కూడా లభిస్తాడని ఢిల్లీ ఆశిస్తోంది.
