టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా భారత్–జింబాబ్వే మధ్య జరగబోయే కీలక మ్యాచ్‌కు ముందు టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ, వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ చెన్నైలోని ప్రసిద్ధ మారుండీశ్వరర్ ఆలయాన్ని సందర్శించారు. చెపాక్‌లో జరిగే ఈ మ్యాచ్ లో తప్పనిసరిగా గెలవాల్సింది. దీంతో మ్యాచ్‌కు ముందు వీరు ఆలయానికి వెళ్లడం అందరి దృష్టిని ఆకర్షించింది. మారుండీశ్వరర్ ఆలయంలోని ఆ పరమ శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మారుండీశ్వరర్ ఆలయాన్ని “ఆరోగ్యానికి దేవుడు”గా భావిస్తారు. ‘మరుందు’ అంటే ఔషధం అని అర్థం.. అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కోసం ఉపశమనం కోరుతూ భక్తులు ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. దీంతో అభిషేక్ శర్మ ఈ ఆలయాన్ని సందర్శించడం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కడుపు ఇన్ఫెక్షన్ కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందిన అతడు, ఈ టోర్నీలో నాలుగు మ్యాచ్‌ల్లో మూడు సార్లు డకౌట్ అయ్యాడు.
►ALSO READ | T20 World Cup: ఇంగ్లాండ్పై ఓటమి.. పాకిస్తాన్ సెమీస్కి ఎలా చేరుకుంటుందంటే?
భారత్ సెమీఫైనల్ చేరాలంటే ఈ మ్యాచ్ చాలా కీలకం. అందుకే ఫామ్‌లోకి రావాలని, ఆత్మవిశ్వాసం పెంచుకోవాలని అభిషేక్ శర్మ ఆ పరమ శివుడి ఆశీస్సులు కోరినట్లు తెలుస్తుంది. అక్షర్ పటేల్ కూడా ఈ టోర్నమెంట్‌లో కీలక పాత్ర పోషించాల్సి ఉంది. ఇలాంటి కీలక మ్యాచ్ ముందు ఆటగాళ్లు మనోబలం పెంచుకోవడానికి ఆలయాలను దర్శించడం సహజమేనని క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నారు. భారత్‌కు ‘డూ ఆర్ డై’ మ్యాచ్‌కు ముందు అభిషేక్ శర్మ, అక్షర్ పటేల్ ఆలయ దర్శనం టీమిండియాపై ఉన్న ఒత్తిడి ఎంత ఉందో కనిపిస్తుంది.
