T20 World Cup: ఇంగ్లాండ్పై ఓటమి.. పాకిస్తాన్ సెమీస్కి ఎలా చేరుకుంటుందంటే?

T20 World Cup: ఇంగ్లాండ్పై ఓటమి.. పాకిస్తాన్ సెమీస్కి ఎలా చేరుకుంటుందంటే?

T20 World Cup: పల్లెకెలే వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ సూపర్-8 మ్యాచ్‌లో పాకిస్తాన్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. ఇంగ్లాండ్ చేతిలో 2 వికెట్ల తేడాతో ఓడిపోయి, సెమీఫైనల్ వెళ్లే అవకాశాలను కఠినతరం చేసుకుంది. 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ ఆరంభంలో కష్టాల్లో పడింది. 58 పరుగులకే కీలకమైన నాలుగు వికెట్లు కోల్పోయింది. అయితే అక్కడ నుంచి ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ బ్యాటింగ్ బాధ్యతలు తీసుకుని మ్యాచ్‌ను పూర్తిగా తమవైపుకు తిప్పాడు. కేవలం 51 బంతుల్లో 100 పరుగులు చేసి ఇంగ్లాండ్‌కు సంచలన విజయాన్ని అందించాడు. ఈ ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి.

ఈ గెలుపుతో  ఇంగ్లాండ్ రెండు మ్యాచ్‌ల్లో రెండు విజయాలతో 4 పాయింట్లు సాధించి, సూపర్-8 గ్రూప్-2 నుంచి సెమీఫైనల్‌కు అర్హత సాధించిన మొదటి టీంగా నిలిచింది. ఇది ఇంగ్లీష్ జట్టుకు వరుసగా ఐదో టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ కావడం విశేషం. మరోవైపు పాకిస్తాన్ మాత్రం రెండు మ్యాచ్‌ల్లో ఒకే పాయింట్‌తో థర్డ్ ప్లేస్ లో కొనసాగుతుంది. ఈ ఓటమితో పాక్ నెట్ రన్‌రేట్ కూడా (-0.461) దిగజారి పోయింది.  

గ్రూప్-2 ప్రస్తుత స్థితి:
* ఇంగ్లాండ్ – 4 పాయింట్లు (NRR +1.491)
* న్యూజిలాండ్ – 1 పాయింట్ (NRR 0)
* పాకిస్తాన్ – 1 పాయింట్ (NRR -0.461)
* శ్రీలంక – 0 పాయింట్లు (NRR -2.550)


పాక్ ఇలా చేస్తేనే సెమీస్ కి వెళ్లేది:  

* పాకిస్తాన్ శ్రీలంకపై విజయం సాధించాలి.. అలాగే, ఇంగ్లాండ్ న్యూజిలాండ్‌పై గెలవాలి. శ్రీలంక న్యూజిలాండ్‌పై గెలిస్తే.. అప్పుడు పాయింట్ల పట్టికలో పాకిస్తాన్ (3), శ్రీలంక (2), న్యూజిలాండ్ (1)లో నిలుస్తాయి. దీంతో గ్రూప్-2 నుంచి రెండో స్థానంలో నిలిచిన జట్టుగా పాకిస్తాన్ సెమీఫైనల్‌కు వెళ్తుంది..  

* న్యూజిలాండ్ తమ మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో ఒకదాంట్లో విజయం సాధించి, మరోదాంట్లో ఓడితే– పాకిస్తాన్ శ్రీలంకపై గెలవడంతో– పాకిస్తాన్, న్యూజిలాండ్ రెండూ 3 పాయింట్లతో ఉంటాయి. అప్పుడు మెరుగైన నెట్ రన్ రేట్ (NRR) ఉన్న టీం సెమీస్ కి అర్హత సాధిస్తుంది.  

* పాకిస్తాన్ శ్రీలంకతో మ్యాచ్‌లో ఓడితే– నేరుగా టోర్నమెంట్ నుంచి వెళ్లిపోవడం ఖాయం.

* పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక మ్యాచ్ వర్షంతో రద్దైతే పాకిస్తాన్‌కు 2 పాయింట్లు వస్తాయి. అలాగే శ్రీలంక vs న్యూజిలాండ్ మ్యాచ్ కూడా వర్షంతో రద్దైతే లంక జట్టుకు కూడా 2 పాయింట్లు ఉంటాయి. దీంతో న్యూజిలాండ్ ఇంగ్లాండ్ చేతిలో ఓడితే, న్యూజిలాండ్ కూడా 2 పాయింట్లతోనే ఉంటుంది. అప్పుడు పాకిస్తాన్, శ్రీలంక, న్యూజిలాండ్ జట్లలో ఏ టీంకి మెరుగైన నెట్ రన్ రేట్ ఉందో అది ఇంగ్లాండ్‌తో కలిసి సెమీఫైనల్‌కు చేరుతుంది.

►ALSO READ | స్కూల్ గేమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు నిధులు కేటాయించండి..సీఎం రేవంత్ ను కోరిన ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐ