బెంగాల్‎లో హనీట్రాప్ నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్ గుట్టు రట్టు.. జైషే ఉగ్రవాది గర్ల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్రెండ్ అర్పిత అరెస్ట్

బెంగాల్‎లో హనీట్రాప్ నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్ గుట్టు రట్టు.. జైషే ఉగ్రవాది గర్ల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్రెండ్ అర్పిత అరెస్ట్

కోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కతా: రాజకీయ నాయకులను హనీట్రాప్ చేసి కీలక సమాచారం రాబట్టేందుకు పన్నిన ఉగ్ర కుట్రను పశ్చిమ బెంగాల్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్) భగ్నం చేసింది. జైషే మహ్మద్ అనుమానిత ఉగ్రవాది హమిమ్ మోండల్ గర్ల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫ్రెండ్, జార్ఖండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన అర్పితా సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీఎఫ్ పోలీసులు గురువారం సాహెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అరెస్ట్ చేసి బర్ధమాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తరలించారు.

 హమిమ్ మోండల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అర్పిత అత్యంత సన్నిహితురాలు. ఐఎస్ఐ మద్దతు ఉన్న ఈ ముఠా.. బెంగాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని బీజేపీ నేతలు, వీఐపీల కదలికలపై నిఘా పెట్టడం, రిక్రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లు చేయడమే లక్ష్యంగా పనిచేస్తోంది. ఈ కుట్రలో భాగంగానే రాజకీయ నాయకులతో పరిచయాలు పెంచుకుని, వారి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడానికి అర్పితను హనీట్రాప్ నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వాడుకున్నట్లు పోలీసులు తెలిపారు.