కుంభరాశి.. ఆగస్టు నెల జాతకం.. కీలకమార్పులు జరిగే అవకాశం.. దానధర్మాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి..!

కుంభరాశి.. ఆగస్టు నెల జాతకం.. కీలకమార్పులు జరిగే అవకాశం.. దానధర్మాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి..!

గురుడు శుభ దృష్టి వలన కుంభ రాశివారికి  ఆగస్టు నెలలో కీలక మార్పులు జరిగే అవకాశం ఉంది.  చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో మీ బాధ్యతలను నెరవేరుస్తారు. డబ్బు అకస్మాత్తుగా వచ్చి సమకూరుతుంది. ఈ రాశి వారు ఆగస్టు నెలలో ఏ పని చేపట్టినా  సంపూర్ణ అదృష్టం లభిస్తుంది.దాన..ధర్మాలకు దూరంగా ఉండటం మంచిదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

కుంభ రాశి వారికి  ఆగస్టు నెలలో శుభ గ్రహాల సంచారం వల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఉద్యోగంలో కొత్త అవకాశాలు లభిస్తాయి. వ్యాపారంలో కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి అనుకూల సమయమని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ప్రతి విషయంలో కూడా కుటుంబ సభ్యుల సలహాలు తీసుకుంటే  మంచి ఫలితాలను ఇస్తాయి. విలాసవంతమైన వస్తువులపై ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నందున ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. 

శని, కుజుడు, సూర్యుడు  అనుకూల సంచారం వల్ల ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. అధికార యోగానికి అవకాశముంది. బుధ గ్రహం కూడా అనుకూలంగా మారుతున్నందువల్ల సమయ స్ఫూర్తితో వ్యక్తిగత సమస్యలు పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. అదనపు ఆదాయం కోసం ప్రయత్నాలు సాగిస్తారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. వృత్తి, వ్యాపా రాలు ఊపందుకుంటాయి. ముఖ్యమైన పనులు జాప్యం లేకుండా పూర్తవుతాయి. 

ఆర్థిక విషయాలకు వస్తే మెరుగుపడే అవకాశం ఉంది.. కుటుంబంలోని సమస్యలు తొలగిపోతాయి.  బంధువుల నుండి మద్దతు లభిస్తుంది. కొత్త ఇల్లు, వాహనం కొనుగోలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో శుభకార్యాలు జరగడానికి సూచనలు కనిపిస్తున్నాయి. ఉచిత సహాయాలకు, దానధర్మాలకు దూరంగా ఉండడం మంచిది. ఆశించిన పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. . ప్రేమ వ్యవహారాలు సంతృప్తికరంగా సాగిపోతాయని పండితులు చెబుతున్నారు

పరిహారం:  రోజూ శివాలయాన్ని దర్శించండి.. బుధవారం వినాయకుడికి గరిక సమర్పించి.. మంగళవారం హనుమంతుడిని ఆకుపూజచేయాలి

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.