- మోచేయి, భుజం, మోకాలికి గాయాలు
జూబ్లీహిల్స్, వెలుగు : ఫిలింనగర్ పీఎస్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పంజాగుట్ట ఎస్ఐ ఎం.శ్రీలత గాయపడ్డారు. శుక్రవారం రాత్రి డ్యూటీ ముగించుకుని స్కూటీపై ఇంటికి వెళ్తుండగా ఫస్ట్ క్రై షాపింగ్ షోరూం సమీపంలోని షేక్‌పేట్ నాలా వద్ద గుర్తుతెలియని కారు వెనక నుంచి ఓవర్‌స్పీడ్‌తో వచ్చి ఢీకొట్టింది.
ప్రమాదంలో ఆమె కుడి మోచేయి, భుజం, మోకాలికి గాయాలయ్యాయి. డ్రైవర్పరార్కాగా, స్థానికులు శ్రీలతను గోల్కొండ ఏరియా దవాఖానకు తరలించారు. శనివారం ఘటనపై ఆమె ఫిర్యాదు చేశారు.
