అమెరికాలో ఘోర ప్రమాదం: ట్రంప్ ఇంటి సమీపంలో కుప్పకూలిన ప్రైవేట్ జెట్.. 9 మంది మృతి

అమెరికాలో ఘోర ప్రమాదం: ట్రంప్ ఇంటి సమీపంలో కుప్పకూలిన ప్రైవేట్ జెట్.. 9 మంది మృతి

వాషింగ్టన్: అమెరికాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. తొమ్మిది మందితో ప్రయాణిస్తున్న ప్రైవేట్ జెట్ ఆదివారం (నవంబర్ 1) దక్షిణ ఫ్లోరిడాలోని రహదారిపై కుప్పకూలి పేలిపోయింది. ఈ ఘటనలో జెట్‎లో ప్రయాణిస్తోన్న తొమ్మిది మంది మరణించారు. ఫ్లోరిడా రాష్ట్రంలోని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నివాసం మార్-ఎ-లాగోకు 14 కిలోమీటర్ల దూరంలో పామ్ బీచ్ కౌంటీలోని క్రెస్ట్‌హేవన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. జెట్ ఆకాశం నుంచి మిస్సైల్ మాదిరిగా భూమి మీదుకు దూసుకొచ్చి ఒక్కసారిగా బ్లాస్ట్ అయిన దృశ్యాన్ని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోల్లో జెట్ మిస్సైల్ మాదిరిగా భూమి మీదుగా దూసుకొచ్చి పేలిపోవడంతో భారీగా మంటలు చెలరేగాయి. ప్రమాద తీవ్రతకు రోడ్డుపై భారీ గుంత ఏర్పడింది. 

ప్రతికూల వాతావరణం, ఉరుములు, మెరుపులు

అధికారుల వివరాల ప్రకారం.. ప్రమాదానికి గురైన విమానం రెండు ఇంజన్లు గల లియర్ జెట్ 60 రకానికి చెందినదని తెలిపారు. ఈ ప్రైవేట్ జెట్ టెక్సాస్‌లోని ఆస్టిన్ నుంచి బయలుదేరి బహామాస్‌కు వెళ్తుండగా దక్షిణ ఫ్లోరిడాలోని పామ్ బీచ్ కౌంటీలోని క్రెస్ట్‌హేవన్ సమీపంలోని రోడ్డుపై జన నివాసంలోని రోడ్డుపై క్రాష్ అయ్యింది. మిస్సైల్ మాదిరిగా ఆకాశం నుంచి దూసుకొచ్చి రోడ్డుపై కుప్పకూలడంతో భారీగా మంటలు  చెలరేగాయి. అగ్నిగోళంలా జెట్ పేలిపోయింది.

ప్రమాదం సమయంలో విమానం 35,000 అడుగుల ఎత్తులో తూర్పు దిశగా ప్రయాణిస్తోంది. ఈ సమయంలో ప్రతికూల వాతావరణం, ఉరుములు, భారీ వర్షం, మంచు పేరుకుపోవడం వంటి సమస్యలు ఎదుర్కొన్నట్లు ఏటీసీకి నివేదించి.. మరో 2,000 అడుగులు (సుమారు 610 మీటర్లు) ఎత్తుకు ఎదగడానికి పైలట్లు అనుమతి కోరారు. కొద్దిసేపటికే విమానం ఆకస్మాత్తుగా నియంత్రణ కోల్పోయి నివాస ప్రాంతంలో క్రాష్ అయ్యింది. 

ఘోర విషాదం

ఫ్లోరిడా రాష్ట్రంలో జరిగిన విమాన ప్రమాదాన్ని అమెరికా రవాణా శాఖ కార్యదర్శి సీన్ డఫీ ధృవీకరించారు. ఫ్లోరిడాలోని పామ్ బీచ్ కౌంటీలో జరిగిన విమాన ప్రమాదం ఒక ఘోర విషాదమని అభివర్ణించారు. లీర్‌జెట్ 60 విమానంలో ప్రయాణిస్తున్న తొమ్మిది మంది కూడా మరణించారని ఆయన ధృవీకరించారు. ప్రమాదానికి గురైన విమానం టెక్సాస్‌లోని ఆస్టిన్ నుంచి బయలుదేరి బహమాస్‌కు వెళ్తోంది. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకోవడానికి ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్, నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ బృందాలు రంగంలోకి దిగి దర్యాప్తును ప్రారంభించాయని తెలిపారు.