గచ్చిబౌలి, వెలుగు : గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన మారథాన్‌ను విజయవంతంగా పూర్తి చేసి మెడల్ అందుకున్న ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్..కొద్దిసేపటికే అకస్మాత్తుగా కుప్పకూలి చనిపోయాడు. గచ్చిబౌలి స్టేడియంలో ఎన్ఈబి సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం మారథాన్ నిర్వహించారు. ఇందులో మణికొండలోని అల్కాపురి కాలనీలో ఉంటూ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న కొమ్మినేని గోపి (36) పాల్గొన్నాడు.
మారథాన్‌ను పూర్తి చేసి మెడల్ అందుకున్న తర్వాత అల్పాహారం కోసం వెళ్తుండగా ఒక్కసారిగా కుప్పకూలాడు. నిర్వాహకులు సమీపంలోని దవాఖానకు తరలించగా, చికిత్స పొందుతూ చనిపోయాడు. గుండెపోటుతోనే గోపి చనిపోయాడని డాక్టర్లు ప్రకటించారు. గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
