- గతంలో సాఫ్ట్వేర్ ఎంప్లాయ్
- ఆర్థిక ఇబ్బందులే కారణం
మాదాపూర్, వెలుగు: ఆర్థిక ఇబ్బందులతో ఓ యువకుడు దుర్గం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. నల్లగండ్ల మీరో అపార్ట్మెంట్స్లో ఉండే సాయి మహేశ్వర్(29) గతంలో సాఫ్ట్వేర్ జాబ్ చేశాడు. తర్వాత ఉద్యోగం మానేసి, కొద్ది రోజులు మొబైల్ షాప్ బిజినెస్ చేసి ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు. శనివారం మధ్యాహ్నం సాయి మాదాపూర్ కేబుల్ బ్రిడ్జి మీదకు వెళ్లి దుర్గం చెరువులోకి దూకేశాడు.
మాదాపూర్ పోలీసులు, డీఆర్ఎఫ్ సిబ్బంది సాయంతో చెరువులో గాలించగా మృతదేహం దొరికింది. ఆర్థిక ఇబ్బందులతోనే సాయి ఆత్మహత్య చేసుకొని ఉంటాడని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
