ఆదివాసీ ఎరుకుల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి : సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోకిని రాజు

ఆదివాసీ ఎరుకుల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి : సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోకిని రాజు
  •     ఏకలవ్య కార్పొరేషన్ ..రూ.500 కోట్ల బడ్జెట్ కేటాయించాలి

బషీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాగ్, వెలుగు : అన్ని రంగాల్లో వెనుకబడిన ఆదివాసీ ఎరుకుల సామాజిక వర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఆదివాసీ ఎరుకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోకిని రాజు కోరారు. హైదరాబాద్ బషీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాగ్ ప్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్లబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేసి, దాని చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఎరుకుల సామాజిక వర్గానికి అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.500 కోట్ల బడ్జెట్ కేటాయించాలన్నారు. 

ఎరుకుల విద్యార్థులకు ప్రత్యేక సీట్లు కేటాయించాలని, రాజకీయ అవకాశాలు కల్పించాలని కోరారు. ఎస్టీ కార్పొరేషన్ ద్వారా నిరుపేద ఎరుకుల కుటుంబాలకు బ్యాంకులతో సంబంధం లేకుండా రూ.12 లక్షల వరకు రుణ సదుపాయం కల్పించాలన్నారు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం రామానుజపురంలోని కాకతీయ రాజులు నిర్మించిన ఎరుకుల నాంచారమ్మ పంచకూటాలయ దేవాలయాన్ని పునర్నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరారు. సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తూ ఎస్టీ వర్గీకరణలో ఏబీసీడీ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని లోకిని రాజు డిమాండ్ చేశారు.