- 61 కిలోల విభాగంలో గ్రూప్-డిలో అగ్రస్థానం
- గ్రూప్-సిలో నిరుపమ నాలుగో ర్యాంకు
నింగ్‌బో (చైనా): ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో భారత లిఫ్టర్లు ఉష, నిరుపమ దేవి మిశ్రమ ఫలితాలు సాధించారు. మహిళల 61 కిలోల విభాగం గ్రూప్-డిలో ఉష అగ్రస్థానంలో నిలవగా.. గ్రూప్-సిలో నిరుపమ నాలుగో స్థానంతో నిరాశపరిచింది. 23 ఏళ్ల ఉష మొత్తం 212 కిలోలు (స్నాచ్ 93, క్లీన్ అండ్ జెర్క్ 119) ఎత్తింది. గ్రూప్-సిలో పోటీపడిన నిరుపమ 211 కిలోలు (91+120) ఎత్తి నాలుగో స్థానంలో నిలిచింది.
ఉష కంటే కేవలం కిలో తక్కువ బరువు ఎత్తినప్పటికీ, గ్రూప్-సిలో పోటీపడినందున ఆమెకు మెరుగైన స్థానం దక్కలేదు. గ్రూప్-సి, డి పోటీలు ముగిసే సమయానికి ఉష ఓవరాల్‌గా మూడో స్థానంలో, నిరుపమ ఐదో స్థానంలో నిలిచారు. అయితే గ్రూప్-ఏ పోటీలు పూర్తయ్యాకే తుది ర్యాంకులు ఖరారు కానున్నాయి. స్నాచ్‌లో ఉష 93 కిలోలు, నిరుపమ 91 కిలోలు ఎత్తారు. క్లీన్ అండ్ జెర్క్‌లో వరుసగా 119, 120 కిలోలు సాధించారు. 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ అర్హత ప్రక్రియలో భాగంగా ఈ చాంపియన్‌షిప్ జరుగుతోంది.
