న్యాయాధికారుల రిటైర్మెంట్ ఏజ్ 62 ఏళ్లకు పెంపు..ఆర్డినెన్స్ జారీ చేసిన ప్రభుత్వం

న్యాయాధికారుల రిటైర్మెంట్ ఏజ్ 62 ఏళ్లకు పెంపు..ఆర్డినెన్స్ జారీ చేసిన ప్రభుత్వం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో న్యాయాధికారుల పదవీ విరమణ వయసును 61 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఈ పెంపును 2026 మార్చి 31 నుంచి వర్తింపజేస్తూ తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ (రెగ్యులేషన్ ఆఫ్ ఏజ్ ఆఫ్ సూపరాన్యుయేషన్) చట్టం–1984లోని సెక్షన్ 3(1ఏ)కు సవరణలు చేసింది. తెలంగాణ స్టేట్ హయ్యర్ జ్యుడీషియల్ సర్వీస్, తెలంగాణ స్టేట్ జ్యుడీషియల్ సర్వీస్‌‌‌‌లకు చెందిన న్యాయాధికారులకు ఈ పదవీ విరమణ వయసు పెంపు వర్తిస్తుంది.

ఈ సవరణను మార్చి 31, 2026 నుంచి అమల్లోకి తీసుకొస్తున్నట్లు ఆర్డినెన్స్‌‌‌‌లో పేర్కొన్నారు. న్యాయాధికారుల పదవీ విరమణ వయసు పెంపుపై సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు, హైకోర్టు ఫుల్ కోర్టు సిఫార్సుల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.  2026 ఆగస్టు 19న పదవీ విరమణ వయసును 61 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచాలని హైకోర్టు ఫుల్ కోర్టు సిఫార్సు చేసింది.