ఆగస్టు నెల జ్యోతిష్యం : సింహరాశి వాళ్లు ఆవేశం తగ్గించుకోవాలి.. తొందరపాటు ఉంటే నష్టమే..

ఆగస్టు నెల జ్యోతిష్యం : సింహరాశి వాళ్లు ఆవేశం తగ్గించుకోవాలి.. తొందరపాటు ఉంటే నష్టమే..

ఆగస్టు నెల సింహరాశి వారికి చాలా కీలకం కానుంది.  ఈ రాశి వారికి గ్రహాల సంచారం అంతగా అనుకూలంగా లేదని పండితులు చెబుతున్నారు.  ఏవిషయంలో కూడా తొందరపడవద్దని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.. ఈ రాశి వారు ఈ నెలలో ఏఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి..ఎలాంటి పరిహారాలు చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . !

ఆగస్టు నెల గ్రహాల సంచారం ఆధారంగా.. జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం సింహరాశి వారికి ఈ నెల మిశ్రమ ఫలితాలుంటాయని పండితులు చెబుతున్నారు.  కోపం.. అసహనం పెరిగే అవకాశం ఉంది.  చేపట్టిన పనుల్లో ఆటంకాలు కలిగే అవకాశం ఉంది.  అనవసరంగా వాదనలు పెరిగే అవకాశం ఉంది.  అందువలన ప్రతి విషయంలో ఓర్పు.. సహనం పాటించాలని  పండితులు సూచిస్తున్నారు.

ఆఫీసుకు సంబంధించిన విషయాలు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది. వృత్తి జీవితంలో ఏమాత్రం తీరిక లేని పరిస్థితి ఏర్పడు తుంది. వృత్తి, ఉద్యోగాల్లో పని భారం పెరిగినా, ఆశించిన స్థాయిలో ప్రతిఫలం ఉంటుంది.  వృత్తి జీవితం బిజీగా సాగుతుంది. వ్యాపారాల్లో సామాన్య ఫలితాలుంటాయి. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు వాయిదా వేయడం మంచిదని పండితులు చెబుతున్నారు. . 

కొందరు బంధువుల వల్ల సమస్యలు తలెత్తవచ్చు.  ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను పూర్తిగా చక్కబెడతారు. డబ్బు ఇవ్వడం, తీసుకోవడం వంటివి పెట్టుకోవద్దు. ఆర్థిక లావాదేవీల్లో నష్టపోయే అవ కాశం ఉంది .

కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి తొందరపడకండి.ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. ప్రతి పనిలోనూ శ్రమ, తిప్పట ఉంటాయి. చిన్ననాటి స్నేహితులతో విందు కార్యక్ర మంలో పాల్గొంటారు.విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది.   మీ వైవాహిక జీవితంలో కొన్ని విభేదాలు ఏర్పడతాయి. కాబట్టి మీ మాటల్లో సంయమనం పాటించాలని పండితులు చెబుతున్నారు.

పరిహారం : మంగళవారం.. శుక్రవారం..  లక్ష్మీదేవికి సుగంధ పరిమళాన్ని సమర్పించాలి.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.