సెంట్రల్‌‌‌‌ జోన్‌‌‌‌ కెప్టెన్‌‌‌‌గా రజత్‌‌‌‌ పటీదార్‌.. 

సెంట్రల్‌‌‌‌ జోన్‌‌‌‌ కెప్టెన్‌‌‌‌గా రజత్‌‌‌‌ పటీదార్‌.. 

‌‌‌Rajat Patidar: న్యూఢిల్లీ: దులీప్‌‌‌‌ ట్రోఫీ కోసం సెంట్రల్‌‌‌‌ జోన్‌‌‌‌ను సెలెక్టర్లు శనివారం ప్రకటించారు. కెప్టెన్‌‌‌‌గా రజత్‌‌‌‌ పటీదార్‌‌‌‌, వెస్‌‌‌‌ కెప్టెన్‌‌‌‌గా రింకూ సింగ్‌‌‌‌ను ఎంపిక చేశారు. ఈ నెల 23 నుంచి సెప్టెంబర్‌‌‌‌ 10 వరకు బెంగళూరులోని బీసీసీఐ సెంటర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ఎక్సలెన్స్‌‌‌‌లో ఈ మ్యాచ్‌‌‌‌లు జరగనున్నాయి. అయితే శ్రీలంక టూర్‌‌‌‌ వెళ్లే టీమిండియాలో చోటు దక్కించుకున్న ఆఫ్‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌ సారాన్ష్‌‌‌‌ జైన్‌‌‌‌ తొలి దశ మ్యాచ్‌‌‌‌లకు అందుబాటులో ఉండే అవకాశాల్లేవు. ఈ నెల 15 నుంచి గాలెలో జరిగే తొలి టెస్ట్‌‌‌‌లో సారాన్ష్‌‌‌‌కు ఆడే అవకాశం కనిపిస్తోంది. 


సెంట్రల్ జోన్ జట్టు: రజత్ పాటిదార్ (కెప్టెన్), రింకూ సింగ్ (వైస్ కెప్టెన్), ఆర్యన్ జుయల్ (కీపర్), సారాన్ష్‌‌‌‌ జైన్‌‌‌‌, అమన్ మొఖాడే, కునాల్ చండేలా, జీషాన్ అన్సారీ, ఆర్యన్ పాండే, అర్షద్ ఖాన్, ఆయుష్ పాండే, యశ్ రాథోడ్, హర్ష్‌‌‌‌ దూబే, కునాల్ సింగ్ రాథోడ్ (కీపర్), యశ్ ఠాకూర్, నచికేత్ భూతే. స్టాండ్-బై ఆటగాళ్లు: అమన్‌‌‌‌దీప్ ఖారే, మయాంక్ మిశ్రా, సౌరభ్ రావత్, భార్గవ్ మేరాయి, కునాల్ యాదవ్, కుమార్ కార్తికేయ.