బాంబు ఎలా తయారు చేయాలో పిన్ టు పిన్ రాసుకున్న విద్యార్థి అరెస్ట్

బాంబు ఎలా తయారు చేయాలో పిన్ టు పిన్ రాసుకున్న విద్యార్థి అరెస్ట్

బాంబు ఎలా తయారు చేయాలో వర్డ్ టు వర్డ్ రాసుకున్నాడు ఓ విద్యార్థి. బాంబు తయారీకి కావాల్సిన పదార్థాలు, కెమికల్స్, వాటి ఫార్ములా, రియాక్షన్స్, తయారీ దశలను రాసుకోవడం చూసి టీచర్లు షాకయ్యారు. అది కూడా ఒక మెడికల్ స్టూడెంట్ ఇలాంటి పనిచేయడం కలకలం రేగింది.

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలోని రాజర్షి దశరథ్ అటానమస్ స్టేట్ మెడికల్ కాలేజీలో ఈ ఘటన వెలుగు చూసింది. బాంబు తయారీకి సంబంధించిన డాక్యుమెంట్ లభించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ను  అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

కాలేజీలోని ఎక్స్-రే రూమ్‌లో శనివారం (ఆగస్టు 01) ఈ డాక్యుమెంట్ ను కనుగొన్నారు.  పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విచారణ ప్రారంభించిన పోలీసులు.. ఫస్ట్ ఇయర్ మెడికల్  విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. అతనితో పాటు డ్యూటీలో ఉన్న మరో ఇద్దరు వ్యక్తులను కూడా విచారిస్తున్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని బల్‌రాంపూర్‌కు   సర్ఫరాజ్ అనే విద్యార్థి బాంబు తయారీకి కావాల్సిన కోడింగ్ అంతా రాసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు ప్రస్తుతం అన్ని కోణాల నుంచి విచారణ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆ పేపర్ ఏదైనా క్రిమినల్ లింక్ ఉందా లేదా అనేది కన్ఫామ్ కాలేదు.  కాలేజీ ప్రధాన వైద్య అధికారి డాక్టర్ అరవింద్ సింగ్ మాట్లాడుతూ,  డాక్యుమెంట్ కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాం. విచారణ జరుగుతోంది. పోలీసుల నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

ఈ సంఘటన తర్వాత కాలేజీలో  భద్రతా ఏర్పాట్లను పరిశీలించి, క్యాంపస్‌లో నిఘా పెంచారు.  కిందటేడాది నవంబర్‌లో ఢిల్లీలోని రెడ్‌ఫోర్ట్ సమీపంలో జరిగిన పేలుడు సంఘటనను లింక్ ఉందా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. ఆ కేసులో యూనివర్సిటీ ఉద్యోగికి  సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది.