అల్యూమినియం ఫాయిల్ టీవీ కింద పెడితే ఏమవుతుంది..? ఇప్పుడు సోషల్ మీడియా, ఇంటర్నెట్ లో ఇదే ప్రశ్న. ఎందుకు నిఫునులు దీన్ని సజెస్ట్ చేస్తున్నారనే చర్చ నడుస్తోంది. టీవీని జాగ్రత్తగా చూసుకోవాలనుకునే చాలా మంది ఇప్పుడు ఈ సింపుల్ ట్రిక్‌ను ఫాలో అవుతున్నారు. ఇది ఏమైనా అద్భుత పరిష్కారమా.. అని డిస్కషన్ నడుస్తోంది.
ఎందుకు పెడతారు?
ఇది సూపర్ సొల్యుషన్ కాదు కానీ, ఫర్నిచర్‌ను రక్షించడం, దుమ్ము పేరుకోకుండా ఉంచడం వంటి విషయాల్లో ఉపయోగపడుతుందని చాలా మంది చెబుతున్నారు. అల్యూమినియం ఫాయిల్ టీవీ కింద దుమ్ము, చిన్న కణాలు పేరుకోకుండా అడ్డుకుంటుందని అంటున్నారు. టీవీ ఎక్కువసేపు పనిచేసినప్పుడు వచ్చే వేడి నుంచి చెక్క లేదా గాజు ఫర్నిచర్‌ను కాపాడుతుందని కూడా చెబుతున్నారు. కొందరు కేబుల్స్‌ను సర్దుబాటు చేసుకోవడానికి, ఆ ప్రాంతాన్ని ఈజీగా శుభ్రం చేసుకోవడానికి కూడా దీన్ని వాడుతున్నారు.
నిపుణులు ఏమంటున్నారు?
అల్యూమినియం ఫాయిల్ టీవీ సిగ్నల్‌ను మెరుగుపర్చడం , పిక్చర్ క్వాలిటీని పెంచడం లాంటివి ఏమీ చేయదు కానీ.. కేవలం సర్ఫేస్ సేఫ్టీ కోసం మాత్రమే ఉపయోగపడవచ్చునని ఎలక్ట్రానిక్స్ నిపుణులు చెబుతున్నారు. కానీ దీన్ని పెట్టేటప్పుడు టీవీ వెంటిలేషన్ ఓపెనింగ్స్‌ను క్లోజ్ కాకుండా చూసుకోవాలి. లేటెస్ట్ టీవీలకు సరిగ్గా గాలి సర్క్యులేషన్ అవసరం. లేకపోతే ఇంటర్నల్ పార్ట్స్ వేడెక్కే ప్రమాదం ఉంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు :
టీవీ వెంటిలేషన్ స్లాట్స్‌ను కప్పడం ప్రమాదం
సాకెట్లు లేదా ఎలక్ట్రికల్ కనెక్షన్లలో ఫాయిల్ పెట్టవద్దు
పాడైన లేదా బేర్ వైర్స్ దగ్గర ఉంచవద్దు
కేవలం సర్ఫేస్ రక్షణకు మాత్రమే వాడటం బెటర్
టీవీ తయారీదారుల సూచనలను తప్పనిసరిగా పాటించడం మంచింది.
ALSO READ : జ్యోతిష్యం: ఆగస్టు నెల.. మేషరాశి.. రాజయోగం.. ధనలాభం.. పూర్తి వివరాలు ఇవే..!
టీవీని మరింత జాగ్రత్తగా చూసుకోవాలంటే...
మైక్రోఫైబర్ క్లాత్‌తో క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి. సూర్యకాంతి డైరెక్ట్ గా పడకుండా చూసుకోండి. తేమ లేదా అధిక వేడి ఉన్న చోట్ల ఉంచకండి. వోల్టేజ్ స్టెబిలైజర్ లేదా సర్జ్ ప్రొటెక్టర్ వాడటం మంచిది.
మొత్తం మీద ఇది ఒక సాధారణ ఇంటి ట్రిక్. సరిగ్గా జాగ్రత్తలు తీసుకుంటే ఫర్నిచర్‌ను కాపాడుకోవచ్చు. కానీ టీవీ పనితీరుకు దీనితో ఎలాంటి సంబంధం లేదని నిపుణులు చెబుతున్నారు.
