చాతుర్మాసం మొదలైంది. ప్రస్తుతం విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉన్నారు. 2026 ఆగస్టు నెలలో గ్రహాల సంచారంలో కీలక మార్పులు ఉన్నాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఈ నెలలోమేష రాశి వారి జీవితంలో సరికొత్త సమీకరణాలకు తెరలేపే అవకాశాలున్నాయి. గ్రహాల సంచారం ఆధారంగా ఈ నెలలో మేషరాశి వారికి ఎలా ఉంటుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!
సూర్యుడు, కుజుడు, రాహువు, గురుడు గ్రహాల సంచారం వలన ఆగస్టు నెలలో మేషరాశి వారికి శుభ ఫలితాలతో పాటు రాజయోగం పొందే అవకాశం ఉంది. ఈ రాశి వారు ఏ ప్రయత్నం తలపెట్టిన విజయవంతమవుతుందని పండితులు చెబుతున్నారు. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు సఫలం కావడంతో పాటు నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. పనిభారం పెరుగుతుంది.
వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగుతాయి. . నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి. ఆర్థిక పరిస్థితి ఇతరులకు సహాయం చేయగల స్థితికి చేరుతుంది. పాత బకాయిలు.. మొండి బాకీలు వసూలవుతాయి. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాలు పొందుతారు. విశ్రాంతి తగ్గే సూచనలున్నాయి. కుటుంబ పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. . ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగుతాయి.
