జీ స్టూడియోస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై సెబీ నిషేధం.. సుభాష్ చంద్రకు రూ.60 లక్షల ఫైన్

జీ స్టూడియోస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై సెబీ నిషేధం.. సుభాష్ చంద్రకు రూ.60 లక్షల ఫైన్
  • హైదరాబాద్ భూవివాదమే కారణం

న్యూఢిల్లీ: హైదరాబాద్ భూములను ఆక్రమంగా తాకట్టుపెట్టడంతో జీ స్టూడియోస్​పై సెబీ కఠిన చర్యలు తీసుకుంది. కంపెనీని రెండు నెలల పాటు సెక్యూరిటీల మార్కెట్ నుంచి నిషేధించింది. కంపెనీ చైర్మన్ ఎమెరిటస్ సుభాష్ చంద్రపై ఏడాది పాటు నిషేధం విధించింది. 

సీఈఓ పునీత్ గోయెంకాపై కూడా చర్యలు ఉంటాయి. ప్రమోటర్లకు చెందిన ఎస్సెల్ గ్రూప్ సంస్థలు తీసుకున్న రుణాల కోసం జీఈఈఎల్ హైదరాబాద్ ఆస్తులను అనధికారికంగా తనఖా పెట్టడమే ఈ వివాదానికి ప్రధాన కారణం.

ఈ వ్యవహారంలో సెబీ జీఈఈఎల్​కు రూ.30 లక్షలు, సుభాష్ చంద్రకు రూ.60 లక్షలు, పునీత్ గోయెంకాకు రూ.58 లక్షల జరిమానా వేసింది. 2018 డిసెంబరులో జరిగిన ఒప్పందం ప్రకారం హైదరాబాద్ ఆస్తుల పత్రాలను ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అందించినట్లు తేలింది. ఆడిట్ కమిటీ ముందస్తు అనుమతి తీసుకోకుండా ఇలా చేయడం తప్పని సెబీ స్పష్టం చేసింది.