హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌లో జరిగిన ఇండియా అండ్ ఆసియా బిజినెస్ కాన్‌క్లేవ్ వేదికగా వెర్చ్ కన్సల్టింగ్ ఫౌండర్, సీఈఓ డాక్టర్ చిక్కాల వేణుగోపాల్ రావు ప్రతిష్టాత్మక బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డు అందుకున్నారు.
తెలంగాణ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా స్వయంగా ఈ పురస్కారాన్ని ఆయనకు అందజేశారు. మానవ వనరుల నిర్వహణ, ఎగ్జిక్యూటివ్ సెర్చ్, లీడర్ షిప్ కన్సల్టింగ్, టాలెంట్ మేనేజ్‌మెంట్ రంగాల్లో ఆయన అందిస్తున్న సేవలను గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేశారు.
ఈ సందర్భంగా రావు మాట్లాడుతూ, తమ సంస్థ అభివృద్ధికి అహర్నిశలు శ్రమించిన ఖాతాదారులు, వ్యాపార భాగస్వాములు, సహచరులందరికీ ఈ పురస్కారాన్ని అంకితం చేస్తున్నట్లు తెలిపారు. సంస్థలకు ఉత్తమ నాయకత్వాన్ని అందించడం, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.
