ICC World Cup 2027: ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2027పై అప్పుడే క్రీడా ప్రపంచంలో ఫుల్ వైబ్స్ స్టార్ట్ అయ్యాయి. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు సంయుక్తంగా ఈ మెగా టోర్నీకి ఆతిథ్యమిస్తున్న సంగతి తెలిసిందే. అయితే జింబాబ్వే, నమీబియాల్లో కేవలం 10 చిన్న మ్యాచ్‌లు మాత్రమే జరిగే ఛాన్స్ ఉండటంతో, టోర్నీకి అసలైన మాస్ సెంటర్ సౌతాఫ్రికానే కానుంది. ఈ మెగా టోర్నీలో టీమిండియా ఎక్కువ మ్యాచ్‌లను ఏ మైదానంలో ఆడబోతోందనే దానిపై స్పోర్ట్స్ వర్గాల్లో లేటెస్ట్ బజ్ మొదలైంది.
రేసులో డర్బన్ నా.. సెంచూరియనా:
సౌతాఫ్రికా పర్యటన అంటేనే భారత్ కి రెండు మైదానాలు ఫుల్ సెంటిమెంట్. ఒకటి డర్బన్‌లోని కింగ్స్‌మీడ్, రెండోది సెంచూరియన్‌లోని సూపర్‌స్పోర్ట్ పార్క్.
* డర్బన్ (Kingsmead): ఇక్కడ భారతీయులు ఎక్కువగా ఉంటారు. ఇండియా మ్యాచ్ ఉందంటే చాలు స్టేడియం హౌస్‌ఫుల్ కావడం ఖాయం. 1992లో వర్ణవివక్ష ముగిశాక భారత్ తన తొలి వన్డేను ఇక్కడే ఆడింది.
* సెంచూరియన్ (SuperSport Park): జోహన్నెస్‌బర్గ్, ప్రిటోరియాలకు అత్యంత సమీపంలో ఉండే ఈ మైదానం బ్రాడ్‌కాస్టర్లకు, ప్లేయర్లకు ప్రయాణ పరంగా ఫుల్ కంఫర్ట్ ఇచ్చే స్టేడియం.
* వరల్డ్ కప్‌లో భారత్ ఆడే ఒక్క మ్యాచ్ వర్షార్పణమైనా బ్రాడ్‌కాస్టర్లకు, స్పాన్సర్లకు రూ. వందల కోట్లలో నష్టం వస్తుంది. డర్బన్‌లో వర్షం ముప్పు 12.76 శాతం ఉంటే, సెంచూరిషన్‌లో అది కేవలం 5 శాతం మాత్రమే. అంతేకాదు, వర్షం తగ్గగానే ఆటను త్వరగా రీస్టార్ట్ చేసే వరల్డ్ క్లాస్ డ్రైనేజీ సిస్టమ్ సెంచూరియన్ సొంతం.
భారత్ హోమ్ గ్రౌండ్గా సెంచూరియన్:
కేప్‌టౌన్, జోహన్నెస్‌బర్గ్ లాంటి ఐకానిక్ గ్రౌండ్స్‌లో ఒకటి లేదా రెండు బిగ్ మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉన్నప్పటికీ.. ప్రాసెస్, ప్రయాణం, బ్రాడ్‌కాస్టింగ్ వెసులుబాటు ఆధారంగా చూస్తే లీగ్ దశలో భారత్ ఆడే మ్యాచ్‌లలో 3 నుంచి 4 కీలక మ్యాచ్‌లు సెంచూరియన్‌లోనే జరిగే ఛాన్స్ ఉందనేది లేటెస్ట్ టాక్. మొత్తానికి 2027 మెగా టోర్నీలో సెంచూరియనే టీమిండియాకు హోమ్ గ్రౌండ్ కాబోతోంది.
ఆతిథ్య మైదానాల్లో భారత్ ట్రాక్ రికార్డ్:
మైదానం (Venue) ఆడిన మ్యాచ్‌లు గెలుపు ఓటమి
* సూపర్ స్పోర్ట్ పార్క్,
సెంచూరియన్ 13 6 5
* కింగ్స్‌మీడ్,
డర్బన్ 10 3 6
* ది వాండరర్స్,
జోహన్నెస్‌బర్గ్ 9 4 5
* న్యూలాండ్స్, 6 3 3
కేప్‌టౌన్
* బోలాండ్ పార్క్ 6 3 2
పార్ల్
వర్షం తక్కువగా ఉండే స్టేడియాలు:
స్టేడియం ఆతిథ్యమిచ్చిన వన్డేలు మ్యాచ్ రద్దయ్యే అవకాశం
* సూపర్ స్పోర్ట్ పార్క్
(సెంచూరియన్) 60 5.00%
* కింగ్స్‌మీడ్
(డర్బన్) 47 12.76%
